Gaali Sampath Day 2 Collections: దారుణంగా ‘గాలి సంపత్’ కలెక్షన్లు.. విశ్లేషకులే ఊహించని విధంగా!

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయన్న అపవాదు ఉంది. అయితే, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అలాంటి చిత్రాలే వస్తున్నాయి. తమ అభిమాన హీరో ఎలా కనిపించినా ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్. అందుకే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల లిస్టు పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన చిత్రం 'గాలి సంపత్'. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి షాక్ తగులుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. ఆ వివరాలు మీకోసం!

 వాళ్లందరితో కలిసి వచ్చిన ‘గాలి సంపత్'

వాళ్లందరితో కలిసి వచ్చిన ‘గాలి సంపత్'

అనిష్ కృష్ణ దర్శకత్వంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'గాలి సంపత్'. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.

 అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

అంచనాలను పెంచేసిన టీమ్... బిజినెస్

పెద్ద స్టార్లు నటించకున్నా టీజర్, ట్రైలర్‌తో పాటు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భాగస్వామ్యం ఉండడంతో 'గాలి సంపత్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ నైజాంలో రూ. 2 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, ఆంధ్రాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తంగా ఈ చిత్రం రూ. 6.50 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

 రెండో రోజు ‘గాలి సంపత్' ఎంత కలెక్ట్ చేశాడు?

రెండో రోజు ‘గాలి సంపత్' ఎంత కలెక్ట్ చేశాడు?

రెండో రోజు 'గాలి సంపత్‌'కు భారీ షాకిచ్చారు ఆడియెన్స్. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1.20 లక్షలు, వెస్ట్‌లో రూ. 60 వేలు, గుంటూరులో రూ. 50 వేలు, కృష్ణాలో రూ. 60 వేలు, నెల్లూరులో రూ. 40 వేలతో రెండో రోజైన శుక్రవారం రెండు రాష్ట్రాల్లో రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

రెండు రోజులకు కలిపి ఎంత వసూలయింది?

రెండు రోజులకు కలిపి ఎంత వసూలయింది?

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 52 లక్షలు వసూలు చేసిన గాలి సంపత్... రెండో రోజు మాత్రం నిరాశనే ఎదుర్కొంది. మరోవైపు రెండు సినిమాలు సత్తా చాటుతుండడంతో ఈ సినిమాకు ఆదరణ కరువైంది. అదే సమయంలో థియేటర్లను కూడా భారీగా కోల్పోయింది. ఇక, రెండో రోజు రూ. 12 లక్షలు మాత్రమే రావడంతో.. మొత్తంగా ఈ చిత్రం రూ. 64 లక్షలే కలెక్ట్ చేయడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన 'గాలి సంపత్'.. మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితితో కనిపించింది. ఏపీ తెలంగాణలో కలిపి రూ. 64 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అంటే రెండు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 71 లక్షలు షేర్.... 1.15 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెత వస్తే హిట్?

'గాలి సంపత్'కు మొత్తంగా రూ. 6.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు రూ. 71 లక్షలు వసూలు చేయడంతో.. హిట్ కోసం మరో రూ. 6.29 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే, రెండో రోజే దారుణంగా పడిపోవడంతో అంత టార్గెట్‌ను చేరుకోవడం కష్టంగా మారింది. ఇక, శని, ఆదివారాల్లో పుంజుకుంటుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X