Gaalodu day 1 collections సుడిగాలి సుధీర్ మూవీకి షాకింగ్‌గా కలెక్షన్లు.. తొలి రోజు ఎంతంటే?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్ వెండితెరపై అదృష్ణాన్ని పంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఒకట్రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. తాజాగా గాలోడు సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 18వ తేదీన రిలీజైంది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

6 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్
గాలోడు సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకుపైగా జరిగినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తనకు తెలియదు. 6 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే చాలా సంతోషం. నిర్మాతకు పైసా లాభం వచ్చిన నాకు సంతోషమే అంటూ సుధీర్ చెప్పాడు.

గాలోడు స్క్రీన్ కౌంట్ ఎంతంటే?
ఇక సుధీర్ నటించిన గాలోడు సినిమా రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాలో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో కలుపుకొని మొత్తంగా 375 స్క్రీన్లలో రిలీజ్ అయింది. నైజాంలో 130, సీడెడ్‌లో 60 స్క్రీన్లలో, ఆంధ్రాలో 185కిపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

యావరేజ్ టాక్‌తో గాలోడు
అయితే సుడిగాలి సుధీర్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌తో రిలీజైన గాలోడు సినిమా యావరేజ్‌గా ఉందనే టాక్ తొలి రోజు వినిపించింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఊగిసలాటకు గురయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గాలోడు తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఇక గాలోడు సినిమా తొలి రోజు పెద్దగా ఆక్యుపెన్సీని నమోదు చేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కాకినాడలో 34.25 శాతం ఆక్యుపెన్సీ , వరంగల్‌లో 33 శాతం మేరకు ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మిగితా ప్రాంతాల్లో 20 శాతం కంటే తక్కువే ఆక్యుపెన్సీ కనిపించింది.

గాలోడు తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
గాలోడు సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సుధీర్‌కు మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోలేకపోయారనే మాట వినిపించింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. తొలి రోజు సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలంటే.. కనీసం 6.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











