Gaalodu day 2 collections భారీగా గాలోడు ఓపెనింగ్స్.. తగ్గని సుడిగాలి సుధీర్ మూవీ జోష్
జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సాధించిన కమెడియన్ సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం అదే జోష్‌ను కొనసాగించింది. విడుదలైన తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం 2 రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే?

కథ, కథనాలు వీక్‌గా
మాస్, కమర్షియల్ అంశాలతో రూపొందిన గాలోడు చిత్రంలో సుధీర్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. డ్యాన్సులు, ఫైట్లతో ఆలరించాడు. కథ, కథనాలు, రోటీన్‌గా మేకింగ్ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఉంది. కొత్తదనం లేని కారణంగా సినిమా యావరేజ్‌గా నిలిచింది అనే టాక్ వినిపించింది.

తొలి రోజు వసూళ్లు ఇలా..
పక్కా మాస్ చిత్రంగా రూపొందిన గాలోడు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 126 ప్రాంతాల్లో 248 థియేటర్లలో 823 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా తొలి రోజు 25 శాతం ఆక్యుపెన్సీతో 45 లక్షల షేర్, 1 కోటి రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది.

జిన్నా మూవీ కంటే.. బెటర్‌గా
అయితే ఇటీవల రీలీజైన పెద్ద హీరోల సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను తొలి రోజే గాలోడు సినిమా సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల రిలీజైన జిన్నా సినిమా లైఫ్ టైమ్ బాక్సాఫీస్ జర్నీలో 68 లక్షలు సాధించిన విషయం తెలిసిందే.

గాలోడు రెండో రోజు ఆక్యుపెన్సీ
ఇక గాలోడు రెండో రోజు బాక్సాఫీస్ వద్ద స్టడీగా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. హైదరాబాద్, కాకినాడ, వైజాగ్‌లో ఈ సినిమా ఇంపాక్ట్ కనిపించింది. మిగితా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో 10 శాతం కంటే తక్కువగా వసూళ్లను సాధించింది.

గాలోడు రెండో రోజు కలెక్షన్ల అంచనా
ఇక గాలోడు సినిమా రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. తొలి రోజు కంటే బెటర్‌గా వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల కలెక్షన్లను సాధించవచ్చని పేర్కొంటున్నారు. రెండో రోజు 1.4 కోట్లు, తొలి రోజు 1 కోటికపైగా కలెక్షన్లను కలిపితే.. 2.4 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











