Gaalodu day 4collections సుధీర్ బాబు బాక్సాఫీస్ హవా.. నిలకడగా గాలోడు వసూళ్లు!
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. రెగ్యులర్ కంటెంట్, రొటీన్ స్టోరీ ఉన్నప్పటికీ.. సుధీర్ చేసిన డ్యాన్సులు, ఫైట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. గత మూడు రోజుల్లో పాజిటివ్‌గా బాక్సాఫీస్ రిపోర్టులు వచ్చాయి. అయితే 4వ రోజు గాలోడు సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు
గాలోడు సినిమా మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్ చిత్రంగా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. సుధీర్ క్రేజ్‌తో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజున 1.02 కోట్లు, రెండో రోజున 96 లక్షలు, మూడో రోజున 1.36 కోట్లు సాధించింది. దాంతో 3.34 లక్షలు వసూలు చేసింది.

నాలుగో రోజున అక్యుపెన్సీ
ఇక అన్ని సినిమాలకు అగ్నిపరీక్షగా మారే సోమవారం రోజున గాలోడు చిత్రం యావరేజ్ అక్యుపెన్సీ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో 25 శాతం అక్యుపెన్సీతో సరిపెట్టుకొన్నది. దాంతో ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించింది.

నాలుగవ రోజున తెలుగు రాష్ట్రాల్లో
గాలోడు నాలుగో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 25 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, ఆంధ్రాలో 44 లక్షల వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా నాలుగో రోజు 84 లక్షలు రాబట్టింది. సుధీర్ సింగిల్ హ్యాండెడ్‌గా ఈ సినిమాను ముందుకు తీసుకుపోవడం గమనార్హం అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

4 రోజుల కలెక్షన్లు ఇలా..
ఇక గత నాలుగు రోజులు మొత్తం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.75 కోట్లు, సీడెడ్ 61 లక్షలు, ఆంధ్రాల్లో 2.44 కోట్ల గ్రాస్, సాధించింది. దాతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.8 కోట్ల గ్రాస్, 2.60 కోట్ల షేర్ రాబట్టింది. తొలి వారం ముగిసే సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

గాలోడు లాభాల్లోకి రావాలంటే?
ఇక గాలోడు సినిమా బ్రేక్ ఈవెన్‌పై రకరకాల ఊహాగానాలు మీడియాలోను, ట్రేడ్ వర్గాల్లోను ఉన్నాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 6 కోట్లకుపైగా అమ్మారని ఓ వర్గం.. 2.75 అంటూ మరో వర్గం వెల్లడిస్తున్నది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.90 కోట్ల గ్రాస్, 2.65 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ మూవీ త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











