Gaalodu Official Collections: సుధీర్ రేంజ్ మామూలుగా లేదు.. 3వ రోజు మరీంత ఎక్కువగా..

సుడిగాలి సుధీర్ కేవలం టెలివిజన్ స్టార్ మాత్రమే అనుకుంటే ఇప్పుడు అతను బాక్సాఫీస్ వద్ద కూడా ఉహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సుధీర్ నటించిన గాలోడు సినిమా మొదటి రోజే నెగిటివ్ రివ్యూలు అందుకుంది. ఇక సినిమా మూడవ రోజు మాత్రం మొదటి రెండు రోజుల కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట బజ్ లేకపోయినా..

మొదట బజ్ లేకపోయినా..

సుధీర్ నటించిన గాలోడు సినిమా విడుదలకు ముందు పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. ఎదో ట్రైలర్ లో సుధీర్ కొత్తగా మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు అనే చిన్న బజ్ తప్పితే పెద్దగా హైప్ తెచ్చిన ఎలిమెంట్స్ ఏమి లేవు. కానీ విడుదల తరువాత మాత్రం ఉహాలకందని రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పోటీగా ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్

గాలోడు సినిమా రేంజ్ కు తగ్గట్టుగా 2.75 కోట్ల రెంజ్ లో బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు వందలకు పైగా థియేటర్స్ లో విడుదల చేశారు. సినిమాకు మొదట్లోనే ఊహించని విధంగా రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. సినిమా రొటీన్ ఫార్మాట్ లో ఉందని కామెంట్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ మెల్లగా కలెక్షన్స్ అయితే పెరిగాయి.

 3వ రోజు మరింత ఎక్కువగా..

3వ రోజు మరింత ఎక్కువగా..

ఒక విధంగా గాలోడు సినిమా మొదటి రోజు ఊహించినట్లే డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక శనివారం రోజు ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆదివారం రోజు గాలోడు సినిమాకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడడం విశేషం. మూడవ రోజు ఈ సినిమా మొదటి రెండు రోజుల కంటే ఎక్కువగా 1.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఎక్కువగా మాస్ ఆడియెన్స్ నుంచి సినిమాకు మద్దతు లభిస్తోంది.

 ఏపీ తెలంగాణ వసూళ్ళు

ఏపీ తెలంగాణ వసూళ్ళు

ఇక ఏరియాల వారిగా చూస్తే మొదటి మూడు రోజుల్లో గాలోడు సినిమా నైజాంలో రూ. 1.40 కోట్ల వరకు అందుకోగా.. సీడెడ్ లో 55 లక్షల వరకు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 2.01 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ దక్కినట్లు సమాచారం. అంటే నైజాం ఆంధ్రలో టోటల్ గా కలుపుకొని గాలోడు 3.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అంటే 2.20 కోట్ల షేర్ దక్కింది.

 వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గాలోడు సినిమా మూడు రోజుల్లో 4.06 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక 2.25 కోట్ల వరకు షేర్ దక్కింది. అసలు సినిమా ఈ రేంజ్ లో వసూళ్ళను అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నెగిటివ్ రివ్యూలు టాక్ తో సంబంధం లేకుండా బి, సి సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ప్రాఫిట్స్ ఎంతంటే..

ప్రాఫిట్స్ ఎంతంటే..

ఇక ఇప్పటివరకు గాలోడు సినిమా మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా మొత్తంగా 2.25 కోట్ల షేర్ దక్కింది. అంటే ఇంకా టార్గెట్ ఫినిష్ అవ్వాలి అంటే 75 లక్షల షేర్ రావాలి. గాలోడు సినిమా కు పోటీగా మసూద కూడా ఆదివారం ఇదే రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. ఇక గాలోడు సోమవారం నుంచి ఇంకాస్త ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటే మంచి ప్రాఫిట్స్ అందుకునే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X