Gaami Day 1 Collections గామికి రికార్డు కలెక్షన్లు.. భారీ వసూళ్లతో సత్తా చాటిన విశ్వక్ సేన్.. ఎన్ని కోట్లంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. మహాశివరాత్రి పర్వదినం కానుకగా రిలీజైన ఈ సినిమా టెక్నికల్ బ్రిల్లియెన్స్, విజువల్ వండర్‌గా రూపుదిద్దుకొన్న ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడం తెలిసిందే. క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై నిర్మాత కార్తీక్ సబరీష్ నిర్మాణంలో నూతన దర్శకుడు విద్యాధర్ రావు కగిత ఈ మూవీని సుమారుగా 24 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గామి చిత్రం 12 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆంధ్రా, తెలంగాణలో ఈ సినిమాను 600 స్క్రీన్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
ఓ ఎమోషనల్ పాయింట్‌తో థ్రిల్లింగ్ గురి చేసే అంశంతో రూపొందిన అడ్వెంచరస్ మూవీ రిలీజ్‌కు ముందు భారీ బజ్ క్రియేట్ చేసింది. దాంతో తొలి రోజు మెరుగైన ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా తొలి రోజు 45 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో విశ్వక్ సేన్ కెరీర్‌లో ది బెస్ట్ కలెక్షన్లు నమోదు కావడానికి అవకాశం ఏర్పడింది. ఈ సినిమా రెండో రోజు కూడా స్ట్రాంగ్‌గా అంటే 40 శాతం ఆక్యుపెన్సీని రిజిస్టర్ చేసే అవకాశం ఉంది.

గామి చిత్రం తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్లను చూస్తే.. సుమారుగా 300K అమెరికన్ డాలర్లు అంటే ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక మూవీ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 4.5 కోట్ల నికరంగా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 7 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను, 9.07 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
గామి బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా 11 కోట్లు సంపాదిస్తే లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా 7 కోట్ల మేర నికర వసూళ్లు సాధించింది. అయితే షేర్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











