Gaami Day 4 Collections గామి కలెక్షన్ల ఊచకోత.. విశ్వక్ సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
తెలుగు సినిమా రంగంలో అత్యద్బుతమైన సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందిన చిత్రం గామి. 6 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా చివరకు మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా ఫస్ట్ వీకెంట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గామి సినిమాను కథా డిమాండ్ చేయడంతో హియాలయాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసే సమయంలో షూట్ చేశారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశారు. దాంతో ఈ సినిమా వ్యయం భారీగా కావడంతో సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక మూవీ ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో పాజిటివ్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

గామి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అంతంతా మాత్రంగానే జరిగింది. విశ్వక్ సేన్ మార్కెట్ స్థాయిలో ఈ సినిమా బిజినెస్ జరగకపోవడంతో మూవీపై క్రేజ్ పెరగకపోవడానికి ఓ కారణమైంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా గామి సినిమాను 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే తొలి ఆట నుంచే అనూహ్యంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం, తొలివారాంతం భారీగా వసూళ్లు సాధించడంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాంతో తొలివారాంతం తర్వాత స్క్రీన్లు పెంచడం గమనార్హం.
గామి సినిమాను తొలి రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3.5 కోట్ల రూపాయలు నికరంగా 5.4 కోట్లు గ్రాస్, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో 50 లక్షలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కూడా నిలకడగా 3 కోట్ల రూపాయలు, దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక 3వ రోజు 2 కోట్ల రూపాయలు నికరంగా ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ సినిమా 17 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే సోమవారం కూడా నిలకడగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక నాలుగో రోజు 1 కోటి రూపాయలు నికరంగా, 2 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 19 నుంచి 20 కోట్ల మధ్య కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
గామి సినిమా 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే 19 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











