Gaami Collections విశ్వక్ సేన్ భారీ ఓపెనింగ్స్.. గామి సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై నిర్మాత కార్తీక్ సబరీష్ నిర్మాణంలో నూతన దర్శకుడు విద్యాధర్ రావు కగిత రూపొందించిన చిత్రం గామి. అడ్వెంచరస్, ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమాలో హీరోగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరీ, దయానంధ్ రెడ్డి తదితరులు నటించారు. మార్చి 8వ తేదీన మహశివరాత్రి పర్వ దినం కానుకగా ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన గామి మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేయగలిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అన్ని వర్గాల నుంచి ఆదరణతోపాటు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో సానుకూలమైన బాక్సాఫీస్ జర్నీతో కలెక్షన్లు సాధించే అవకాశం ఏర్పడింది.

ఇక గామి సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతోపాటు వీఎఫెఎక్స్, ఇతర ఖర్చులతో కలిపి 24 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో రూపొందింది. అయితే తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీతో సినిమాను అందించారనే మాట అందరిలోను వినిపించింది.
ఇక గామి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఓ మోస్తారు బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులు 3.5 కోట్లు, సీడెడ్ హక్కులు 1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ హక్కులు 3.5 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక థియేట్రికల్ హక్కులు 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 1 కోటి రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా టోటల్‌గా 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక గామి మూవీకి డీసెంట్ బజ్ క్రియేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో ఈ సినిమాను 600 స్క్రీన్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 950 స్క్రీన్లకుపైగా రిలీజ్ అయింది.
గామి మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ కావడంతో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వరంగల్‌లో అత్యధికంగా 70 శాతం, గుంటూరులో 50 శాతం, విజయవాడలో 55 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం, కాకినాడలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

గామి మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపి 250k డాలర్లకు పైగా అంటే 1.7 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్లకుపైగా, కర్ణాటక ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజున 4.5 నుంచి 5 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











