Gaami Overseas Collection ఓవర్సీస్‌లో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న గామి.. ఎన్ని కోట్ల లాభమంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, యువ హీరోయిన్ చాందినీ చౌదరీ నటించిన తాజా చిత్రం గామి. గత 6 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తి చేసుకొని మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత సాంకేతిక అంశాలు, హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్‌తో ఈ సినిమాను తెరపైన అద్బుతంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా బిజినెస్ విషయాల్లోకి వెళితే..
గామి సినిమా ఇప్పటి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 1 కోటి రూపాయలకు అమ్మడం జరిగింది. అయితే ఈ సినిమాకు ఉత్తర అమెరికా అంటే అమెరికా, కెనడాలో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

గామి చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా ప్రమోషన్స్ కూడా నామమాత్రంగానే ముగించారు. అయితే సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ సినిమా అమెరికాలో 500K అమెరికా డాలర్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అమెరికాలో గామి చిత్రం ప్రీమియర్ల ద్వారా 160K డాలర్లు, తొలి రోజు 130K, రెండో రోజు 115K, మూడో రోజు 56 వేల డాలర్లు, నాలుగో రోజు 26 వేల డాలర్లు, ఐదో రోజు 45 వేల డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా క్రేజ్ పెరుగుతుండటంతో రోజు రోజుకు కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
గామి సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్, నైజాంలో ఈ సినిమా 12.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, ఇండియాలో 11.5 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 4.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











