GaayaPadda Simham Closing Collections: గాయపడ్డ సింహం క్లోజింగ్ కలెక్షన్లు.. తరుణ్ భాస్కర్ మూవీ హిట్టా? ఫట్టా?

టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాదినేని సమర్పణలో యంగ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాయపడ్డ సింహం. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: విద్యా సాగర్ చింతా, ఎడిటర్: విప్లవ్ నైషాడం, మ్యూజిక్: స్వీకార్ అగస్తి, కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల, ప్రొడక్షన్ డిజైన్: చంద్రికా గొర్రెపాటి తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఫన్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

GaayaPadda Simham Box Office

గాయపడిన సింహం సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సుమారుగా 10 కోట్ల రూపాయల మేర ట్రేడ్ జరిగింది. భారీగా జరిగడంతో వల్ల దాదాపు 75 శాతానికి పైగా బడ్జెట్ రికవరీ జరిగింది. అలాగే థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయానికి వస్తే.. 5 కోట్ల మేర వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్ల నెట్, 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆంధ్రాలో 475 స్క్రీన్లలో, తెలంగాణలో 350 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటకలో 35 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను సుమారుగా 900 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు.

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 60 లక్షల నెట్, రెండో రోజు 65 లక్షలు, మూడో రోజు 55 లక్షల నెట్, నాలుగో రోజు 30 లక్షల నెట్, ఐదో రోజు 30 లక్షల నెట్, ఆరో రోజు 25 లక్షల నెట్, ఏడో రోజు 30 లక్షల నెట్ వసూలు చేసింది. దాంతో తొలి వారం ఈ సినిమా 2.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా రెండో వారం కూడా థియేటర్‌లో రన్ కొనసాగించింది. ఈ చిత్రం గత 14 రోజుల్లో 50 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం టోటల్‌గా అంధ్రా, నైజాం, కర్ణాటకలో కలిపి 3.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో మరో 50 లక్షల నెట్ సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ కాలేకపోయినా.. నిర్మాతకు ఈ సినిమా ఓవరాల్‌గా భారీ లాభాలను సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X