GaayaPadda Simham Box Office: గాయపడ్డ సింహం బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? తరుణ్ భాస్కర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాదినేని సమర్పణలో యంగ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాయపడ్డ సింహం. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: విద్యా సాగర్ చింతా, ఎడిటర్: విప్లవ్ నైషాడం, మ్యూజిక్: స్వీకార్ అగస్తి, కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల, ప్రొడక్షన్ డిజైన్: చంద్రికా గొర్రెపాటి తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఫన్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

GaayaPadda Simham Movie 2 days Box Office

కామెడీ, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, జేడీ చక్రవర్తి లాంటి నటీనటులతో ఎక్కువ మంది ఆర్టిస్టులతో సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన వారు, పనిచేసిన సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. అలాగే థియేట్రికల్ రైట్స్ పరంగా ట్రేడ్ విషయంలో సానుకూలమైన వాతావరణంలో రిలీజైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల షేర్, 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లుగా వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆంధ్రాలో 475 స్క్రీన్లలో, తెలంగాణలో 350 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటకలో 35 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను సుమారుగా 900 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు.

గాయపడ్డ సింహం సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం 1 కోటి రూపాయల నెట్, 1.70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 30 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ మూవీ తొలి రోజు 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ మూవీకి పాజిటివ్ టాక్ పెరుగుతుండటంతో రెండో రోజు కూడా తొలి రోజు రేంజ్‌లో కలెక్షన్లు నమోదు అవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కడపటి సమాచారం తెలిసే వారకు ఈ చిత్రం 80 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రాత్రి షోలు పూర్తయ్యే వరకు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలకుపైగా కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రెండు రోజుల్లో రాబట్టే అవకాశం ఉంది అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X