Gaayapadda Simham Business: గాయపడ్డ సింహం మూవీ బిజినెస్.. తరుణ్ భాస్కర్ సినిమాకి ఎన్ని కోట్లంటే?

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మూవీ గాయపడ్డ సింహం. టైటిల్‌తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్ధుల్లా మానస చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత ఓ కీలకపాత్ర పోషించారు. కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్‌లు ఇతర పాత్రల్లో నటించారు.

గాయపడ్డ సింహం తారాగణం
పవన్ సాధినేని సమర్పణలో.. కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ కుమార్ బన్సాల్‌లు గాయపడ్డ సింహాన్ని నిర్మించారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రాఫర్‌గా, స్వీకర్ అగస్తి సంగీత దర్శకత్వం వహించారు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన గాయపడ్డ సింహం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? అనేది పరిశీలిస్తే..

Gaayapadda Simham Movie Pre Release Business Worldwide Tharun Bhascker Movie Budget Theatrical Business Break Even Target details

సోలోగా గాయపడ్డ సింహం
ఏప్రిల్ 30వ తేదీన రావాల్సిన రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది మూవీ వాయిదాపడటంతో తరుణ్ భాస్కర్ మూవీని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కర, పేట్రియాట్ తదితర భారీ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగులో విడుదలవుతున్న ఏకైక పెద్ద సినిమాగా గాయపడ్డ సింహం నిలిచింది. మంచి టాక్ వస్తే కలెక్షన్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

గాయపడ్డ సింహం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి గాయపడ్డ సింహం మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో గాయపడ్డ సింహం మూవీపై మంచి బజ్ నెలకొంది. చిత్ర యూనిట్ క్రమం తప్పకుండా సినిమాను ప్రజల్లో ఉంచేందుకు కష్టపడింది. ఈ క్రమంలోనే గాయపడ్డ సింహం మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ బిజినెస్
డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి ఈ సినిమాకు 10 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రా, నైజాంలలో 5 కోట్ల రూపాయలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా+ ఓవర్సీస్ కలిపి 2.5 కోట్ల రూపాయల మేర గాయపడ్డ సింహం బిజినెస్ చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా తరుణ్ భాస్కర్ మూవీకి 7.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్నారు. తద్వారా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి గాయపడ్డ సింహం మూవీకి 17.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా తరుణ్ భాస్కర్ మూవీకి రిలీజ్‌కి ముందే 5.5 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ అందుకుని సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది.

గాయపడ్డ సింహం బ్రేక్ఈవెన్ టార్గెట్
గాయపడ్డ సింహం మూవీ లాభాల్లోకి రావాలంటే డిస్ట్రిబ్యూషన్ పరంగా.. 8 కోట్ల రూపాయల షేర్.. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అదే నిర్మాతల ప్రకారం చూస్తే.. బడ్జెట్‌ (12 కోట్ల రూపాయలు)లో నుంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ (10 కోట్ల రూపాయలు) తీసేస్తే 3 కోట్ల రూపాయల షేర్, 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే సరిపోతుందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. వీకెండ్, వేసవి సెలవుల నేపథ్యంలో గాయపడ్డ సింహం మూవీకి ఆక్యూపెన్సీ బాగుంటుందని భావిస్తున్నారు. మరి తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X