‘గబ్బర్ సింగ్’ 2 వీక్స్ కలెక్షన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఈ నెల 24తో విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుని భారీ కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. 10 రోజులకే రూ. 50 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈచిత్రం 2 వీక్స్ పూర్తయ్యే సరికి దాదాపు రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మొత్తం కలెక్షన్లలో నిర్మాతలకు దాదాపుగా రూ. 51 కోట్ల షేర్ లభించినట్లు తెలుస్తోంది.
ఇక 2 వారాల్లో గబ్బర్ సింగ్ ఏరియా వైజ్ సాధించిన 'షేర్' వివరాలు పరిశీలిస్తే...(ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం)
నైజాం: 14.12 కోట్లు
సీడెడ్: 6.86 కోట్లు
వైజాగ్: 3.70 కోట్లు
ఈస్ట్: 2.72 కోట్లు
వెస్ట్: 2.42 కోట్లు
క్రిష్ణా: 2.51 కోట్లు
గుంటూరు: 3.35 కోట్లు
నెల్లూరు: 1.45 కోట్లు
కర్నాటక: 2.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.77 కోట్లు
ఓవర్సీస్ : 10.25
టోటల్ షేర్ : 51.85 కోట్లు
మరి గబ్బర్ సింగ్ ప్రభంజన ఎంత వరకు సాగుతుందో..? ఇప్పటి వరకు టాలీవుడ్ నెం.1గా ఉన్న మగధీర రికార్డును క్రాస్ చేస్తుందా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభిమానులు కలెక్షన్లు చూసి మురిసి పోతుంటే...పవర్ స్టార్ మాత్రం ఈ కలెక్షన్ల వివరాలపై పెద్దగా ఇంట్రస్టు చూపడం లేదు.


Click it and Unblock the Notifications











