Gabbar Singh 4K Closing Collections: ఇంద్ర రికార్డును బ్రేక్ చేసిన గబ్బర్ సింగ్.. మహేష్ రికార్డు పవన్ చెక్!

గబ్బర్ సింగ్ మూవీ రీ రీలీజ్ సినిమాల్లో చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకు అందరి హీరోల మీద ఉన్న రికార్డులను పవన్ కల్యాణ్ మూవీ బ్రేక్ చేయడం సంచలనంగా మారింది. పవర్ స్టార్ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రదర్శనను అభిమానులు పండుగలా జరుపుకొన్నారు. దాంతో రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గబ్బర్ సింగ్ 4K సినిమా తొలి రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో అప్పటి వరకు ఉన్న మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు సాధించిన కలెక్షన్లను అధిగమించింది. రీ రిలీజ్ సినిమాల హిస్టరీలో గబ్బర్ సింగ్ చరిత్ర తిరగరాసింది.

Gabbar Singh 4K Closing Box Office Collections Worldwide Pawan Kalyan thrashes Indra Murari records

తొలి రోజు ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో 1 కోటి రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా 8 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. రీ రిలీజ్ సినిమాలో ఇదే అత్యధిక కలెక్షన్లు కావడం విశేషంగా మారింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఈ సినిమా నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారీగా బుకింగ్స్ జరిగాయి. స్ట్రేయిట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమాకు స్పందన లభించింది. ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు 5K డాలర్లు వసూలు చేసింది. ఇక నార్త్ నార్త్ అమెరికాలో ఈ మూవీ 66.5K డాలర్లను రాబట్టింది.

Gabbar Singh 4K Closing Box Office Collections Worldwide Pawan Kalyan thrashes Indra Murari records

టాలీవుడ్ రీ రీలీజ్ సినిమాల కలెక్షన్ల విషయాలో అమెరికాలో అప్పటి వరకు ఇంద్ర చిత్రం పేరిట రికార్డు ఉండేది. చిరంజీవి నటించిన ఆ చిత్రం ఆగస్టు 22న రిలీజై 65720 డాలర్లను వసూలు చేసింది. ఆ సినిమా రికార్డులను గబ్బర్ సింగ్ ఇటీవల బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో 56 లక్షల రూపాయలను వసూలు చేసింది.

ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాల రీ రీలీజ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా సాధించిన వివరాల్లోకి వెళితే.. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా 3 కోట్లు, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం 4 కోట్లు, పవన్ కల్యాణ్ నటించిన ఖుషి చిత్రం 4.15 కోట్లు, మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ చిత్రం 5.27 కోట్లు, మహేష్ బాబు మురారీ 5.4 కోట్లు, పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X