Gabbar Singh 4K Collections: ఇంద్రను టచ్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్.. బాలయ్య, ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ మూవీని అభిమానులు ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేశారు. ఆంధ్రాలో వరద పరిస్థితుల కారణంగా ఎక్కువ హంగామా కనిపించకపోగా, నైజాంలో మాత్రం అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గబ్బర్ సింగ్ రీ రిలీజ్‌పై తుఫాన్ పరిస్థితులు భారీగా ప్రభావం చూపాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో షోలు రద్దు చేశారు. అయినా ఈ సినిమా ప్రతికూల పరిస్థితుల్లో భారీగానే ముందస్తు బుకింగ్‌లు బుక్‌మై షోలో జరిగాయి. ఈ సినిమా 125K టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ మురారీ సాధించిన 161K మార్క్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. కానీ మొత్తంగా 3 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Gabbar Singh 4K Collections Worldwide Pawan Kalyan away from Chiranjeevi s indra records

ఇక ఆంధ్రాలో పెద్దగా ఈ సినిమాకు కలెక్షన్లు రాబట్టలేకపోయినప్పటికీ.. నైజాంలో మాత్రం సుమారుగా 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే కర్ణాటకలో మాత్రం స్పెషల్ షోలు ప్రదర్శించిన అన్ని చోట్ల హౌస్‌పుల్స్ నమోదు అయ్యాయి.

ఇక నార్త్ అమెరికాలో గబ్బర్ సింగ్ సినిమాను రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. అమెరికా, కెనడాలోని 116 కి పైగా లోకేషన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రం యూఎస్‌లో 60000 డాలర్లు అంటే 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇటీవల ఇంద్ర సాధించిన 65K డాలర్లను రికార్డును అధిగమించలేకపోయింది.

ఇప్పటి వరకు అమెరికాలో ఇంద్రా 65k, గబ్బర్ సింగ్ 60K, చెన్నకేశవ రెడ్డి 51K, సింహాద్రి 50K, మురారీ 45K డాలర్ల కలెక్షన్లు నమోదు చేసింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ బాబు కలెక్షన్లను సునాయసంగా అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే వరదలు, తుఫాన్ ఎదురించిన గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డును తిరగరాసింది. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 153 సెంట్లర్లలో 335 సినిమాల్లో 1431 షోస్ ప్రదర్శించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్ ఈ చిత్రం 6 కోట్లకుపైగా షేర్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X