Gabbar Singh 4K Collections: చరిత్ర సృష్టించిన గబ్బర్ సింగ్.. మహేశ్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీని ఇటీవల జనసేనాని జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌గా థియేటర్లలో ప్రదర్శించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ సినిమా రికార్డులు తిరగరాయడంతోపాటు రీ రిలీజ్ సినిమాల కలెక్షన్లలో అత్యధిక వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గబ్బర్ సింగ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతీ చోట ప్రేక్షకులు భారీగా తరలి వచ్చి.. థియేటర్లను కుంభమేళాను తలపించేలా చేశారు.

కర్ణాటకలో గబ్బర్ సింగ్ ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ మూవీ సాధించని విధంగా తొలి రోజు 55 లక్షల షేర్ వసూలు చేసింది. గతంలో ఈ మొత్తం మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఫస్ట్ డే షేర్ 41 లక్షల కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ చిత్రం రెండు రోజుల్లో మొత్తం 70 లక్షల రూపాయల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఏపీ, నైజాంలో వరద, తుఫాన్ పరిస్థితులు ఉన్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా ఈ సినిమా కుమ్మేసింది. నైజాంలో ఈ సినిమా 3.2 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 82 లక్షలు, ఉత్తరాంధ్రలో 53 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 50 లక్షలు, గుంటూరులో 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరులో 11 లక్షలు వసూలు చేసింది.

ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను గబ్బర్ సింగ్ రాబట్టింది. కర్ణాటకలో 70 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో 40 లక్షలు వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం 64K డాలర్లు అంటే 54 లక్షలు రూపాయలు కలెక్ట్ చేసింది. గతంలో ఇంద్ర క్రియేట్ చేసిన 65K డాలర్లు కలెక్షన్లకు చేరువగా వచ్చి నిలిచింది.
గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 8.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీ రిలీజ్ చిత్రంగా మహేష్ బాబు నటించిన మురారీ పేరిట రికార్డు ఉండేది. ఆ రికార్డును ప్రస్తుతం గబ్బర్ సింగ్ తుడిచిపెట్టేసింది.


Click it and Unblock the Notifications











