307 సెంటర్లతో రికార్డు సృష్టించబోతున్న ‘గబ్బర్ సింగ్’
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది.
ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుని 7వ వారంలోకి అడుగుపెట్టి 50 రోజుల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో రికార్డులు బద్దలు కొట్టిన గబ్బర్ సింగ్ మరో బిగ్గెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకోబోతోంది. హయ్యెస్ట్ థియేటర్స్(301)లో 50 రోజులు పూర్తి చేసకున్న మగధీర ఇప్పటి వరకు నెం.1 స్థానంలో ఉండగా....గబ్బర్ సింగ్ చిత్రం తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టబోతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 'గబ్బర్ సింగ్' ప్రస్తుతం 307 థియేటర్లలో రన్ అవుతోంది. ఇవే థియేటర్లు 50 రోజులు పూర్తయ్యే వరకు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గబ్బర్ సింగ్ ఓవర్సీస్‌లో ఏ తెలుగు సినిమా కూడా సాధించలేని సూపర్ కలెక్షన్స్ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











