twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్ సింగ్' ఐదు వారాల కలెక్షన్ రికార్డు

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం హిస్టారికల్ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఐదు వారాల్లో డబ్బై కోట్లుకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. జూన్ 29 నాటికి యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎక్కువ సెంటర్లు లలో ఉండటం కూడా ఓ రికార్డు ని నమోదు చేసింది. ఎగ్డిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రంతో చాలా ఖుషీగా ఉన్నట్లు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ఓ జెన్యూన్ హిట్ గా తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని పరిగణిస్తోంది.

    "పవన్‌ కళ్యాణ్ లేకపోతే 'గబ్బర్‌సింగ్' లేదు. ఈ సినిమా కొత్త రికార్డులు కొట్టేంత హిట్టు కావడం వెనుక పవన్‌కళ్యాణ్ కృషి ఎంతో ఉంది. తన ఆరోగ్యాన్ని పణంగాపెట్టి ఈ సినిమా చేశారు. ఇంత పెద్ద హిట్టొచ్చిందని ఆయన్ను కలిసి కలెక్షన్ల గురించి చెప్పబోతే ఆయన వారించారు. వాటికి ఆయన అతీతుడు. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్, ఎడిటర్ గౌతంరాజు, ఫైట్‌మాస్టర్లు రామ్-లక్ష్మణ్ పాత్ర కూడా ఉంది అని హరీష్ చెప్పారు.

    నిర్మాత బండ్ల గణేష్ బాబు మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్' రాకతో మునుపటి రికార్డులన్నీ ఎగిరిపోయాయి. మా సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నా మా హీరో అలాంటివేమీ పట్టించుకోకుండా తోటపని చేసుకుంటున్నారు. ఆయన వీటిని పట్టించుకోర ని అన్నారు. త్వరలో ఈ సినిమా విజయోత్సవాన్ని భారీ ఎత్తున చేయబోతున్నాం. ఆ సందర్భంగా ఈ సినిమాని పైరసీ నుంచి కాపాడిన అభిమానులకు సన్మానం చేస్తాం అని చెప్పారు.

    హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలోని పాత రికార్డులను తన కలెక్షన్స్ తో చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.

    English summary
    "Gabbar Singh" movie has generated great business so far and continues to be on top in all the centers in the fifth week too. According to the latest reports, Gabbar Singh has engrossed more than 70 cr in its five weeks and this is tipped to be an all time record in Tollywood history. "Gabbar Singh" is also on the cusp of creating a new record for the highest number of direct centers for 50 days run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X