షాక్..'గబ్బర్ సింగ్' కలెక్షన్స్ 128 కోట్లు
ప్రముఖ పత్రిక 'బిజినెస్ స్టాండర్డ్'లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్ గురించి రాసుకొచ్చారు. వారు ప్రచురించిన లెక్కలు ప్రకారం ఈ మూడు వారాల్లో 128.75 కోట్లు కలెక్టు చేసింది. జూన్ 1 నాటికి ఈ లెక్కలు అని వారు తేల్చారు. గ్లోబెల్ మార్కెట్ లో ఈ చిత్రంకి వచ్చిన రెస్పాన్స్ ,కలెక్షన్స్ తో ఈ లెక్కలు ప్రచురించారు. దబాంగ్ చిత్రం 173 కోట్లు కలెక్టు చేసి టాప్ 5 బాలీవుడ్ చిత్రాలులో ఒకటిగా నిలిచిందని దాన్ని ఈ చిత్రం బీట్ అవుట్ చేసినట్లే అన్నారు.
గబ్బర్ సింగ్ చిత్రం ముప్పై కోట్లుతో నిర్మించి 2,857 స్క్రీన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారని,ఎక్కువ సెంటర్లు విడుదల చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచిందని రాసారు. ఈ విషయమై బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ కామెంట్ ని యాడ్ చేసారు. తరుణ్ ఆదర్శ్ మాట్లాడుతూ..హిందీ సినిమాలు విడుదలయ్యే వన్ ధర్డ్ స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కానీ అంతకంటే పెద్దదిగా నిలిచింది. అమెరికాలో 43 స్క్రీన్స్ తో ఈ చిత్రం విడుదలైంది.
గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రం గురించి ఓ రేంజిలో అప్ డేట్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఒరిజనల్ చిత్రం దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆయన ఈ కలెక్షన్స్ ని చూసి షాక్ అయ్యారు. తమిళంలో ఓస్తి పేరుతో శింబుతో చేసినా వర్కవుట్ కాని ఈ సినిమా పూర్తి మార్పులతో తెలుగులో చేయటాన్ని, అది పెద్ద హిట్టవటాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలుగు హీరోల చిత్రాలు తాను రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్ చేసి అంత పెద్ద హిట్ కొట్టడం ఆయనికి విచిత్రంగా ఉంది.
ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











