'గబ్బర్ సింగ్' అమెరికా, తమిళనాడు కలెక్షన్స్

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “గబ్బర్ సింగ్" ఆంధ్రాలో విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ సునామీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగతా ఏరియాలో కూడా ఇదే విధమైన హవా కనపడుతోంది. అమెరికా,తమిళనాడు,కర్ణాటకలో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ కలెక్షన్స్ ట్రేడ్ నిపుణులుని షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్..బాలీవుడ్ చిత్రాలకన్నా ఎక్కువ వసూలు చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వ్యాఖ్యానించాడు.

తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో....గబ్బర్ సింగ్ సినిమా ఈ వీకెండ్ మొత్తం కలిసి $577,090 రాబట్టిందని చెప్పారు. బాలీవుడ్ చిత్రాల థియేటర్లతో పోలీస్తే మూడో వంతు థియేటర్లో విడుదలైన ఈ చిత్రం వాటి కన్నా ఎక్కువ రాబట్టింది అన్నారు. అలాగే ఈ చిత్రం కలెక్షన్స్ జోరు మరికొంత కాలం కొనసాగుతుందని.. మరింత ఎక్కువగా అమెరికాలో బిజినెస్ చేస్తుందని అన్నారు. ఫ్యాన్స్ కి నచ్చిన ఈ చిత్రం అమెరికాలో ఒక్కొక్కరూ ఒకటికి నాలుగు సార్లు చూస్తున్నారని అక్కడున్న మనవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇక తమిళనాడు బిజినెస్ విషయానికి వస్తే...తమిళ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్ళై తన ట్విట్ లో ఈ చిత్రం కలెక్షన్ గురించి రాసుకొచ్చారు. ఆయన మాటల్లో...తమిళనాడులో ఇరవై ఐదు స్క్రీన్స్ తో విడుదలైన ఈ చిత్రం ఎక్కడా డ్రాప్ కాలేదు. చెన్నైలో కూడా అద్బుతమైన ఓపినింగ్స్ వచ్చాయి. స్ట్రైయిట్ తమిళ సినిమా మాదిరి ఈ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకూ రిలీజైన చిత్రాల్లో ఈ రేంజి ఓపినింగ్స్ ఈ చిత్రానికే వచ్చాయి. చాలా మల్టిప్లెక్స్ లు రెండో రోజు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పూర్తిగా గబ్బర్ సింగ్ నే ప్రదర్శిస్తున్నాయి. తమిళేతర చిత్రానికి ఈ ఆదరణ రావటం అపూర్వం అని ప్రశంశించారు.

గబ్బర్ సింగ్ కలెక్షన్స్ ఆంద్రాలో ఈ వీకెండ్ మూడు రోజులు దుమ్ము దులిపాయి. చాలా చోట్ల మల్టిప్లెక్స్ లలో మిగతా సినిమాలు తీసేసి..కేవలం గబ్బర్ సింగ్ నే ప్రదర్శించారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడ్డాయి. మూడో రోజు కూడా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మటం ఈ సినిమా విజయం రేంజి ని తెలుపుతోందని చెప్తున్నారు. సినిమాకు ప్లస్ అయిన ఎంటర్టన్మెంట్ గురించి అంతటా హాట్ టాపిక్ గా నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కి వచ్చి ఈ హిట్ అని అభిమానులంతా పండుగ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X