'గబ్బర్‌ సింగ్' థియేటర్స్ పెంచుతున్నారా?

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రిలీజైన నాటి నుండీ అదరకొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి మరో ఎనిమిది థియేటర్స్ ని హైదరాబాద్ లో కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యాభై రోజుల నాటికి రికార్డు నెంబర్ థియేటర్స్ దీనితో వస్తాయని భావిస్తున్నారు. ఐదవ వారం నుంచి ఈ థియేటర్స్ పెంపు ఉంటుంది. మగధీర తర్వాత గబ్బర్ సింగ్ మాత్రమే రికార్డుల బ్రద్దలు కొడుతుందని చెప్తున్నారు.


ఇక గబ్బర్ సింగ్ పాతిక రోజులు 325 సెంటర్లలో కంప్లీట్ చేసుకుంది. అందులో 306 థియేటర్లు ఆంధ్రాలోవే కావటం విశేషం. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్ ఫంక్షన్ ఘనంగా జరపాలని గణేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరు అవుతానని మాట ఇచ్చాడని తెలుస్తోంది.

హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా గబ్బర్ సింగ్ లోని కొన్ని సీన్స్ ని సల్మాన్ ఖాన్ కొనుగోలు చేసారు. అప్పుడు కలిసిన గణేష్ తో ఈ హామీ సల్మాన్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. "గబ్బర్ సింగ్" లో హైలెట్ గా నిలిచిన కొన్ని సీన్స్ రైట్స్ ని సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం "దబాంగ్ -2″ కోసం వీటిని తీసుకున్నారు. అందునిమిత్తం బండ్ల గణేష్ తో యాభై లక్షలు చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇంతకీ ఆ సీన్స్ ఏమిటో మీరు ఈ పాటికి ఊహించే ఉంటారు. అవి ..సెంకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్,కట్ అవుట్ సీన్. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే కబడ్డి సీన్స్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X