twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒరే సాంబా, రాసుకో.. గబ్బర్ సింగ్ రికార్డు కలెక్షన్లు.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ సునామీ!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రిలీజై మే 11వ తేదీకి 8 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. తమ ఫేవరేట్ హీరో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాను గుర్తు చేసుకొంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అలజడి రేపారు. #8YrsOfGabbarSinghHysteria, #VakeelSaab హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చి హంగామా సృష్టించారు. కేవలం 34 నిమిషాల్లోనే 10 లక్షల ట్వీట్స్ చేసి దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో నంబర్ 1గా నిలిచారు. గతంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన ఈ చిత్రానికి సంబంధించిన రికార్డులను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్బంగా 2012లో గబ్బర్ సింగ్ వసూలు చేసిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

    Recommended Video

    #8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
     మాటలు తూటాల్లా..

    మాటలు తూటాల్లా..

    పవన్ కల్యాణ్ కెరీర్‌ను పరిశీలిస్తే.. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు దాదాపు ఓ పది సినిమాలు ఫ్లాపులను మూటగట్టుకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో హిందీలో ఘన విజయం సాధించిన దంబంగ్ సినిమాను రీమేక్‌గా గబ్బర్ సింగ్‌ను మలిచారు. తెలుగు నేటివిటికి తగినట్టుగా కథ, కథనాలు మార్చి.. డైలాగ్స్‌ను తూటాల్లా పేల్చారు. పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించడంతో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.

     తొలివారమే రికార్డులు తిరగరాస్తూ

    తొలివారమే రికార్డులు తిరగరాస్తూ

    2012లో మే 11 తేదీన రిలీజైన గబ్బర్ సింగ్ తొలి ఆట నుంచే బ్రహ్మండమైన టాక్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.15 కోట్లు వసూలు చేసింది. అదే ఊపులో తొలి వారాంతానికి రూ.16.45 కోట్లు రాబట్టింది. ఇక తొలివారంలో రూ.29 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో వారంలో ఈ చిత్రం రూ.11.6 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ యాత్రకు బీజం వేసింది.

    తొలివారం ఏరియాల వారీగా

    తొలివారం ఏరియాల వారీగా

    తొలివారంలో ఆంధ్రా, నైజాం, సీడెడ్‌లో వసూళ్లపరంగా గబ్బర్ సింగ్ కుమ్మేసింది. తొలి వారంలో ఈ చిత్రం నైజాంలో రూ.9.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.2 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.83 కోట్లు, గుంటూరులో రూ.2.45 కోట్లు, నెల్లూరులో రూ.1.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.34 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.03 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.72 కోట్లు వసూలు చేసింది. తొలివారంలోనే ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్‌ను సాధించడం అప్పట్లో ఆల్ టైమ్ రికార్డుగా మారింది.

    పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే మైలురాయిగా

    పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే మైలురాయిగా

    గబ్బర్ సింగ్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రం పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచే చిత్రంగా మారింది. ఈ చిత్రం ఏకంగా 54 సెంటర్లలో 100 రోజులు ఆడింది. నైజాంలో 6 సెంటర్లలో, సీడెడ్‌లో 17 సెంటర్లలో, ఉత్తరాంధ్రలో 11 సెంటర్లలో, గుంటూరులో 5 సెంటర్లలో, తూర్పు గోదావరిల జిల్లాలో 09, పశ్చిమ గోదావరి జిల్లాలో 03, కృష్ణా జిల్లాలో 3 సెంటర్లలో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్నది.

     ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    ఇలా గబ్బర్ సింగ్ ప్రభంజనం పూర్తి స్థాయిలో కొనసాగడంతో బాక్సాఫీస్ వద్ద రూ.129 కోట్ల గ్రాస్, రూ.62 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఏపీ, తెలంగాణలో రూ.51 కోట్ల షేర్‌ను సాధించడం అప్పట్లో రికార్డుగా నిలిచింది. అంతేకాకుండా 2012లో ఇది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. నిర్మాత బండ్ల గణేష్ తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.

    English summary
    Gabbar Singh move has been completed 8 years in Tollywood, On this occassion, Pawan Kalyan movie rocks in Twitter again. As trending on number 1 twitter, It collects 129 crores gross and 62 crores net.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X