'గబ్బర్ సింగ్' 50 డేస్ కలెక్షన్స్ (ఏరియా వారీగా)
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రిలీజైన నాటినుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ 50 రోజుల పండగకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో 50 రోజులకు ఈ చిత్రం రికార్డులు బ్రద్దలు కొడుతుందా..కొత్త రికార్డులు క్రియేట్ చేసిందా అనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఓ పాపులర్ ఇంగ్లీష్ దిన పత్రిక కథనం ప్రకారం...ఈ చిత్రం కలెక్షన్స్ 63.92 కోట్లు కలెక్టు చేసింది. కొనుక్కున్నవారంతా ఈ చిత్రం తెప్పిస్తున్న కలెక్షన్స్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ చిత్రం కలెక్షన్స్ వివరాలు..ఏరియాలు వారిగా..
నైజాం - 20 కోట్లు
సీడెడ్ -9 కోట్లు
నెల్లూరు - 1.95 కోట్లు
గుంటూరు - 4.3 కోట్లు
కృష్ణా - 3.17 కోట్లు
వెస్ట్ గోదావరి - 3.25 కోట్లు
ఈస్ట్ గోదావరి - 3.7 కోట్లు
వైజాగ్ - 5.75 కోట్లు
కర్ణాటక - 3.5 కోట్లు
మిగిలిన ఇండియాలో - 2 కోట్లు
ఓవర్ సీస్ - 7.3 కోట్లు
మొత్తం గ్రాండ్ టోటల్...63.92 కోట్లు (షేర్)
ఇక గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జోష్ తో చేసి అదరకొట్టాడు. దబాంగ్ సినిమా నచ్చి తనే స్వయంగా నిర్మిద్దామని కొనుక్కున్నాడు. అలాగే ఎప్పుడో హరీష్ శంకర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అవకాశం ఇచ్చాడు. పవన్ నమ్మకాన్ని హరీష్ నిలబెడుతూనే..మొదటి ప్రోమో విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు పెరిగాయి. నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది అన్న ప్రోమోకి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అందుకు తగ్గట్లుగా పెరిగిన అంచనాలును నిజం చేస్తూ విడుదలైన రోజే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది.
దర్శకుడు హరీష్ శంకర్ ...ఈ సినిమా సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ... సినిమా అనేది ప్రేక్షకులందరికీ నచ్చాలి. అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేశాను.''అన్నారు హరీష్ శంకర్. ఇక ''హిట్టు..ప్లాప్ లను నమ్ముకొని నేను పరిశ్రమకు రాలేదు. కేవలం పనిని నమ్ముకొని వచ్చాను. వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే... ఒక దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.


Click it and Unblock the Notifications











