Gadar 2 Closing Collections 90 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్.. గదర్ 2 ఎన్ని వందల కోట్ల లాభమంటే?

హిందీ సినిమా పరిశ్రమలో 2023 సంవత్సరంలో ఊహించని కలెక్షన్లు అందుకొన్న చిత్రాల్లో గదర్ 2 మూవీ ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం గత నెల రోజులకుపైగా ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టింది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్ల లాభాలతో ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిందనే వివరాల్లోకి వెళితే..

1947లో భారత, పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందిన గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రానికి అనిల్ శర్మనే దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 చిత్రం ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను 80 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Gadar 2 Closing Collections Worldwide: Sunny Deol Movie near to 700 crores

గదర్ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉండటంతో దాదాపు 3500 స్క్రీన్లలో ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా 4500 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 3.5 లక్షల మంది ఈ సినిమాను వీక్షించినట్టు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది ఈ సినిమా వీక్షించినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఈ సినిమా సుమారు 90 కోట్ల బ్రేక్ ఈవెన్ యాత్రను ప్రారంభించింది.

గదర్ 2 సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ సునామీని సృష్టించింది. తొలి రోజు ఇండియాలో 40 కోట్లకుపైగా, రెండో రోజు 43 కోట్లకుపైగా, మూడో రోజు 51 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 51 కోట్లు, ఐదో రోజు 55 కోట్ల రూపాయలు, ఆరో రోజు 32 కోట్లు, ఏడో రోజు 23 కోట్ల రూపాయలతో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. ఈ చిత్రం తొలివారం 285 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Gadar 2 Closing Collections Worldwide: Sunny Deol Movie near to 700 crores

గదర్ 2 చిత్రం తొలివారం బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టడంతోపాటు రెండోవారం కూడా అదే ఊపును కొనసాగించింది. రెండోవారం మరో 135 కోట్లు, మూడో వారం 63 కోట్లు, నాలుగో వారం 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఐదోవారం ముగిసే సమయానికి ఈ చిత్రం ఇండియాలో 516 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Gadar 2 Closing Collections Worldwide: Sunny Deol Movie near to 700 crores

గదర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా గత ఐదువారాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 516 కోట్ల రూపాయల షేర్, 609 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 65 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 675 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Gadar 2 Closing Collections Worldwide: Sunny Deol Movie near to 700 crores

గదర్ 2 చిత్రం అనూహ్యమైన కలెక్షన్లతో 2023లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా 90 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. దాదాపు ఈ సినిమా 580 కోట్ల లాభాలను రాబట్టింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లాభాలను నమోదు చేసిన సినిమాలు చాలా తక్కువ. పఠాన్ తర్వాత ఆ స్థాయి వసూళ్లను ఈ సినిమా రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X