Gadar 2 Collections గదర్ 2 కలెక్షన్ల ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాసింది. రొమాంటిక్ యాక్షన్, పిరియాడిక్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అప్పటి స్టార్ హీరో సన్నీడియోల్, అమీషా పటేల్‌తోపాటు బాలీవుడ్ లెజెండ్ అమ్రీష్ పురి నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. 18 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే 133 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాలీవుడ్‌లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక గదర్ 2 చిత్రం విషయానికి వస్తే.. సిక్కులపై జరిగిన దాడుల్లో తారా సింగ్ (సన్నీడియోల్) కనపించకుండా పోతాడు. అయితే తారా సింగ్ కొడుకు చరణ్ జిత్ (మనీష్ వాద్వా) తన తండ్రి గురించి వెతుకుతూ ఉంటాడు. అయితే తన తండ్రి పాకిస్థాన్‌లో బంధింపబడి ఉంటారని పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టి అక్కడి సైన్యానికి చిక్కుతాడు. చరణ్ జిత్ తన తండ్రి తారా సింగ్ ఆచూకీ తెలుసుకొన్నాడా? అనేది ఈ సినిమా కథ.
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాద్వా, గౌరవ్ చోప్రా, సిమ్రత్ కౌర్ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు సుమారు 80 కోట్ల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటంతో ఇండియాలో 3500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఆగస్టు 11వ తేదీన రిలీజైన గదర్ 2 సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. సినీ విమర్శకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రిలీజ్ రోజు తొలి ఆట నుంచే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడటం, పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి.

గదర్ 2 సినిమాకు తొలి రోజు భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ సినిమాకు యావరేజ్‌గా ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 40 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాతోపాటు రిలీజైన ఓ మై గాడ్ 2 సినిమా కలెక్షన్ల రేసులో వెనుకబడింది.


Click it and Unblock the Notifications











