Gadar 2 Collections బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన గదర్ 2.. కోట్ల రూపాయల కుంభవృష్టి.. ఎన్ని కోట్ల లాభమంటే?

బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీడియోల్ నటించిన గదర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధిస్తూ ముందుకెళ్తున్నది. అంచనాలకు మించి ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు చేరువైన ఈ సినిమా గత 11 రోజుల్లో ఎంత సాధించిందంటే?

గదర్ 2 చిత్రం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటికే పఠాన్, కేజీఎఫ్, దంగల్ లాంటి సినిమాల కలెక్షన్లను, రికార్డులను అధిగమించింది. వర్కింగ్ డే, హాలీడే అనే సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. దాంతో ఈ సినిమా కలెక్షన్లకు ఎక్కడా అడ్డుకట్ట పడేటట్లు కనిపించడం లేదు.

Gadar 2 Collections

గదర్ 2 చిత్రం కలెక్షన్ల పరంగా అరుదైన రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది. 2023లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒక మూవీగా రికార్డులను తిరగరాసే ఛాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 500 కోట్ల రూపాయలు సునాయాసంగా బాక్సాఫీస్ వద్ద పిండేసింది.

గదర్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెలితే ఈ సినిమా తొలి, రెండో వారంలో కూడా సత్తా చాటుతున్నది. తొలి వారం ఈ చిత్రం 285 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో వారంలో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో అదనంగా 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 390 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక గదర్ 2 మూవీ 11వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఈ సినిమా రెండో సోమవారం నిలకడగా కనిపించింది. ఈ సినిమా సగటున 11వ రోజు 35 నుంచి 40 శాతం ఆక్యుపెన్సీని రికార్డు చేసింది. దాంతో ఈ సినిమా 11వ రోజు సుమారు 15 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 390 కోట్ల షేర్, 443 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Gadar 2 Collections

ఇక గదర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. గత 11 రోజుల్లో ఈ చిత్రం సుమారు 60 కోట్ల రూపాయలు సాధించింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా జోరు బాక్సాఫీస్ వద్ద ఆగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X