Gadar 2 Collections ఇండియాలో గదర్ 2 మూవీకి అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల లాభమంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల అనిల్ శర్మ రూపొందించిన గదర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతున్నది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, లవ్ సిన్హా, మనీష్ వాద్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబడుతున్నది. గత 13 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
2001 సంవత్సరంలో రిలీజైన గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన గదర్ 2 చిత్రాన్ని సుమారు 80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో స్క్రీన్ కౌంట్ భారీగా పెంచారు. పలు దేశాల్లో రెండోవారంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది.

గదర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఇండియాలోనే అతి తక్కువ సమయంలో 400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 2023 సంవత్సరంలో అత్యంత వేగంగా 500 కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇంకా నిలకడగా ఈ సినిమా వసూళ్లను రాబడుతున్నది.
ఇక గదర్ 2 చిత్రం ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. తొలివారం ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. మొదటి వారంలో 285 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. ఆ తర్వాత రెండోవారంలో కూడా ఈ సినిమా అదే జోష్‌ను కొనసాగించింది. రెండోవారంలో ఈ సినిమా 115 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

గదర్ సినిమా 12వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 10 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 35 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 472 కోట్ల గ్రాస్, 400 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఒక ఓవర్సీస్‌లో 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 523 కోట్లు వసూలు చేసింది.

గదర్ 2 బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ మూవీ 90 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా తొలివారమే లాభాల్లోకి చేరుకొన్నది. ఇప్పటికీ ఈ చిత్రం సుమారు 300 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఇంకా ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టే విధంగా నిలకడగా, స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











