Gadar 2 Collections 150 కోట్ల గదర్ 2.. రెండో రోజే లాభాల్లోకి.. బడ్జెట్ ఎంత? లాభం ఎంత?

సన్నిడియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన గదర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నది. ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం గురించి, అలాగే బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాసింది. రొమాంటిక్ యాక్షన్, పిరియాడిక్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. 1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో 13 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 130 కోట్లకుగా వసూలు చేసింది.

Gadar 2 Collections

గదర్ 2 చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలను పెంచింది. టీజర్లు, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ భారీ క్రేజ్‌ను పెంచింది. దాంతో విడులయ్యే అన్ని ప్రాంతాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్, ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్, మౌత్ టాక్‌తో హౌస్ పుల్స్ కలెక్షన్లతో నడుస్తున్నది. దాంతో రికార్డు కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.

Gadar 2 Collections

గదర్ 2 సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీని సుమారు 80 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రాన్ని చాలా ప్రాంతాల్లో నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేశారు. దాదాపు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలోనే 3500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం గమనార్హం.

గదర్ 2 సినిమా అందరూ ఊహించినట్టుగానే భారీ అంచనాలను మించి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రానికి ప్రేక్షకులు విశేష ఆదరణ చూపిస్తున్నారు. దాంతో ఈ సినిమా తొలి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్లో తొలి రోజు 5.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది.

ఇక రెండో రోజు కూడా గదర్ 2 చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు 42 నుంచి 45 కోట్ల కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 60 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ కనిపిస్తున్నది. మూడో రోజు ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X