Gadar 2 Collections గదర్ 2 కలెక్షన్ల సునామీ.. పఠాన్, కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేక్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్, హీరోయిన్ అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ కాంబినేషన్‌లో నిర్మాత, దర్శకుడు అనిల్ శర్మ రూపొందించిన చిత్రం గదర్ 2. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నది. ట్రేడ్ వర్గాలు ఊహించని విధంగా భారీ కలెక్షన్లతో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గదర్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. గదర్ చిత్రం భారత్, పాకిస్థాన్ విభజన నేపథ్యంగా తెరకెక్కింది. ఇక గదర్ 2 విషయానికి వస్తే.. 1971 బ్యాక్ డ్రాప్‌తో కథ మొదలవుతుంది. పాకిస్థాన్ చెరలో ఉన్న తన కుమారుడు చరణ్‌జిత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ)ను విడిపించేందుకు తారా సింగ్ (సన్నీడియోల్) పాకిస్థాన్‌కు వెళ్లడం కథగా తెరకెక్కింది. తన కుమారుడిని పాకిస్థాన్ సేనల నుంచి రక్షించాడా? అనేది సినిమా కథ.

Gadar 2 Day 4 Collections worldwide: Sunny Deol movie beats Pathaan and KGF2 collections

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సినిమా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సాధించిన కలెక్షన్ల కంటే రెండింతల కలెక్షన్లను 4వ రోజు రాబట్టడం రికార్డుగా మారింది. వర్కింగ్ డే రోజున.. అది బాక్సాఫీస్‌కు లిట్మస్ టెస్ట్‌గా మారే సోమవారం భారీ కలెక్షన్లు సాధించడం ఈ సినిమా రాబోయే రోజుల్లో సాధించే కలెక్షన్ల స్టామినాను రుజువు చేసింది.

గదర్ 2 సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు 40 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు, రెండో రోజు 43 కోట్ల రూపాయలకుపైగా, మూడో రోజు 52 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. దాంతో ఇండియాలో 135 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 175 కోట్లు వసూలు చేసింది.

Gadar 2 Day 4 Collections worldwide: Sunny Deol movie beats Pathaan and KGF2 collections

గదర్ 2 సినిమా 4వ రోజు కూడా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించింది. వర్కింగ్ డే రోజున అందరి అంచనాలను తలకిందుల చేస్తూ 40 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. దాంతో ఈ చిత్ర ఇండియాలో 175 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల విడుదలైన ఏ చిత్రం కూడా ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టలేకపోవడం గమనార్హం. 2023 సంవత్సరంలో అత్యంత వేగంగా భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో గదర్ 2 ఒకటిగా నిలిచింది.

గదర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 4 రోజు కలెక్షన్లపరంగా రికార్డు క్రియేట్ చేసింది. పఠాన్, కేజీఎఫ్2 చిత్రాల రికార్డులను తిరగరాసింది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం 4వ రోజు 26.5 కోట్లు రూపాయలు వసూలు చేయగా, కేజీఎఫ్ హిందీ వెర్షన్ 30 కోట్లురాబట్టింది. కానీ గదర్ 2 చిత్రం 4వ రోజున ఈ చిత్రం 40 కోట్లు రాబట్టడం రికార్డుగా మారింది.

గదర్ 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత నాలుగు రోజుల్లో ఇండియాలో ఈ మూవీ 175 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌ వసూళ్ల విషయానికి వస్తే.. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 35 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 210 కోట్ల వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X