Gadar 2 day 5 Collections మరో సంచలనం సృష్టించిన గదర్ 2.. షారుక్‌ రికార్డు సన్నీడియోల్ బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ నటించిన గదర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. తొలి మూడు రోజుల్లో కంటే అత్యధికంగా కలెక్షన్లను సాధిస్తున్నది. రోజు రోజుకు వసూళ్లను పెంచుకొంటూ వెళ్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల ప్రవాహం ఎక్కడికి వెళ్లి ఆగుతుందని ట్రేడ్ వర్గాలు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న గదర్ 2 చిత్రం 5వ రోజున కూడా అదే స్పీడ్‌ను బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గదర్ 2 సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. సూపర్ హిట్ టాక్ రావడంతో ఐదు రోజులపాటు సాగిన సెలవులను బాగా సద్వినియోగం చేసుకొన్నట్టు కనిపించింది. శని, ఆదివారాలతోపాటు, సోమవారం వర్కింగ్ డే రోజు కూడా కలెక్షన్లు తగ్గలేదు. ఇక పంద్రగస్టు సెలవు దినం రోజున కూడా దిమ్మతిరిగే కలెక్షన్లను గదర్ 2 సినిమా సాధించింది.

Gadar 2 day 5 Collections worldwide: Sunny Deol movie racing towards 400 crores

గదర్ 2 సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నది. కేవలం హిందీ బెల్ట్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా నాన్ హిందీ ప్రాంతాల్లో ఈ చిత్రం సత్తా చాటుతున్నది. ముంబై, ఢిల్లీ, పూణే, ఆహ్మదాబాద్, సూరత్, జైపూర్, భోపాల్, లక్నో తదితర ప్రాంతాల్లో 85 శాతం నుంచి 95 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి సౌత్ ప్రధాన నగరాల్లో 95 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది.

గదర్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు నుంచి భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. తొలి రోజు 40 కోట్ల రూపాయలు, రెండో రోజు 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో తెలి రోజు రెండు రోజుల కంటే అధికంగా అంటే 52 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో తొలివారాంతం ఇండియాలో 134 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Gadar 2 day 5 Collections worldwide: Sunny Deol movie racing towards 400 crores

ఇక సోమవారం వర్కింగ్ డే రోజున కూడా సన్నీడియోల్ బాక్సాఫీస్‌పై పంజా విసిరాడు. 4వ రోజు 39 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో సోమవారం అత్యధిక వసూళ్లను రాబట్టిన పఠాన్, కేజీఎఫ్2 కలెక్షన్లను మించి వసూళ్లను సాధించింది. దాంతో గత నాలుగు రోజుల్లో ఇండియాలో 170 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

గదర్ 2 చిత్రం 5వ రోజున దిమ్మతిరిగే కలెక్షన్లను రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా మంగళవారం సెలవు దినం కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. దాంతో ఈ చిత్రం 55.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 230 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ కలెక్షన్లను కలిపి ఈ సినిమా 300 కోట్లు వసూలు చేసింది.

Gadar 2 day 5 Collections worldwide: Sunny Deol movie racing towards 400 crores

గదర్ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం బాక్సాఫీస్ వద్ద 90 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యానికి మించి ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల లాభాన్ని ఈ సినిమా నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X