Gadar 2 day 6 Collections గదర్ 2 బాక్సాఫీస్ దండయాత్ర.. మరో షారుక్ రికార్డు బ్రేక్ చేసిన సన్నీడియోల్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సినిమా కలెక్షన్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. హాలీడే, వర్కింగ్ డే అనే తేడా లేకుండా బాక్సాఫీస్‌ను వసూళ్లతో కొల్లగొడుతున్నది. దాదాపు 22 ఏళ్ల తర్వాత వచ్చిన గదర్ ఏక్ ప్రేమ కథ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన గదర్ 2 కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. సన్నీడియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ తదితరులు నటించగా ఈ సినిమా జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మాత, దర్శకుడు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్ల పరిస్థితి ఏమిటనే విషయంలోకి వెళితే..

గదర్ 2 సినిమాకు భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాపై ఆదరణ చూపిస్తున్నారు. దాంతో ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన దంగల్, షారుక్ ఖాన్ నటించిన పఠాన్, యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సెట్ చేసేందుకు సిద్దమవుతున్నది.

Gadar 2 day 6 Collections worldwide: Sunny deol movie breaks Shah Rukh Khans Pathaan box office record

గదర్ 2 చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే.. గత 5 రోజుల్లో ఈ సినిమా భారీగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఎవరూ ఊహించని విధంగా థియేట్రకల్ రన్ కొనసాగుతున్నది. తొలి రోజు 40 కోట్ల రూపాయలు, రెండో రోజు 43 కోట్ల రూపాయలు, మూడో రోజు 51 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 39 కోట్ల రూపాయలు, ఐదో రోజు 55.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 230 కోట్ల రూపాయలను ఇండియాలోనే కలెక్ట్ చేసింది.

ఇక గదర్ 2 మూవీ 6వ రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. బుధవారం థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. దేశవ్యాప్తంగా మార్నింగ్ షోకు 35 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోలకు 75 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. చెన్నైలో అత్యధికంగా 78 శాతం, ఆహ్మాదాబాద్‌లో 70 శాతం, జైపూర్‌లో 74 శాతం, చంఢీగడ్‌లో 70 శాతం, సూరత్‌లో 60 శాతం, బెంగళూరులో 55 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

Gadar 2 day 6 Collections worldwide: Sunny deol movie breaks Shah Rukh Khans Pathaan box office record

ఇక గదర్ 2 చిత్రం 6వ రోజు కూడా బలంగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా సన్నిడియోల్ కెరీర్‌లోనే అత్యుత్తమ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 6వ రోజు 36 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 264 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 332 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

బాలీవుడ్‌లో ఇటీవల రిలీజైన చిత్రాల కంటే మెరుగైన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా పఠాన్ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకెళ్తున్నది. పఠాన్ చిత్రం 6వ రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. గదర్ 2 మాత్రం 36 కోట్లు వసూలు చేసింది. 6 రోజుల్లో పఠాన్ 295 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ చిత్రం ఏకంగా 332 కోట్ల రూపాయలు రాబట్టడం రికార్డుగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X