Gadar 2 Collections 500 కోట్లకు చేరువగా గదర్ 2.. 90 కోట్ల పెడితే.. ఎన్ని కోట్ల లాభమంటే?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గదర్ 2 చిత్రం రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నది. అనిల్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. సన్నిడియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ చిత్రం గత 9 రోజుల్లో సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 సినిమా రూపొందింది. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా రావడంతో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నది. ప్రమోషనల్ బడ్జెట్‌తో కలిపి ఈ సినిమాను కేవలం 85 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. సుమారు 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సినిమా బాక్సాఫీస్ బరిలోకి దూకింది.

Gadar 2 day 9 Collections worldwide: Sunny Deol movie racing towards 500 crores club

గదర్ 2 సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడంతో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3500 నుంచి 4000 స్క్రీన్లలో విడుదల చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. పబ్లిక్ డిమాండ్ పెరిగిపోవడంతో షోల సంఖ్యను భారీగా పెంచారు. దాంతో మంచి ఆక్యుపెన్సీ కలెక్షన్లు వస్తున్నాయి.

గదర్ 2 సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. 40 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రారంభమై రోజు రోజుకు పెంచుకొంటూ పోయింది. ఈ సినిమా తొలివారం ముగిసే సమయానికి 285 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో కూడా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. రెండో శుక్రవారం 20 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

Gadar 2 day 9 Collections worldwide: Sunny Deol movie racing towards 500 crores club

ఇక గదర్ 2 రెండో శనివారం కూడా రికార్డు వసూళ్లను సాధించింది. శనివారం రోజున మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 64 శాతం, సెకండ్ షోకు 77 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో 9వ రోజు కూడా 32 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. దాంతో రెండోవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 336 కోట్లు వసూలు చేసినట్టు అయింది.

Gadar 2 day 9 Collections worldwide: Sunny Deol movie racing towards 500 crores club

గదర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా నార్త్, అమెరికాలో 35 కోట్లు రాబట్టింది. మిగితా దేశాల్లో కలిపి ఈ సినిమా సుమారుగా 435 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 90 కోట్ల బ్రేక్ ఈవెన్‌ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా రికార్డు స్థాయిలో లాభాలను రాబట్టింది. దాదాపు 200 కోట్లకుపైగా లాభాలతో దూసుకుపోతున్నది. రానున్నరోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X