Gadar 2 16 Days Collections: గదర్ 2 సంచలనం.. కేజీఎఫ్ రికార్డు ఖతం.. అన్ని కోట్లు వస్తే బాహుబలి ఔట్

గతంలో కంటే ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమ కాస్త వెనుకబడిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అక్కడ భారీ హిట్ల కోసం బాలీవుడ్ వాళ్లు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఏడాది ఆరంభంలో 'పఠాన్' వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన చిత్రమే 'గదర్ 2'. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ బెండు తీసేస్తుంది. ఫలితంగా బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'గదర్ 2' 16 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

Gadar 2 Movie

గదర్ 2తో సన్నీ ఊచకోత: చాలా కాలంగా భారీ హిట్ కోసం చూస్తున్న సన్నీ డియోల్ నటించిన చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. దీన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రల్లో కనిపించారు.

Gadar 2 Movie

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: 'గదర్ 2' చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో 2000 థియేటర్లలోనే విడుదలైన ఈ మూవీ రెండో వారం నుంచి 3000లకు పైగా స్క్రీన్లలో రన్ అవుతోంది.

Gadar 2 Movie

ఏ రోజు ఎంత వచ్చిందంటే: సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్‌ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు ఈ చిత్రం రూ. 7.10 కోట్లు, 16వ రోజు 12.50 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది.

Gadar 2 Movie

16 రోజుల్లో అన్ని కోట్లు ఔట్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 'ఓ మై గాడ్ 2' సినిమా నుంచి కఠినమైన పోటీ ఉన్నా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. ఇలా 16 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 438.70 కోట్లు నెట్‌, రూ. 570 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Gadar 2 Movie 16 Days Collections.. Sunny Deol Films Crossed KGF Chapter 2 Collections

ఏకంగా అన్ని కోట్లు లాభం: పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 16 రోజుల్లోనే ఏకంగా రూ. 570 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 480 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇదే కంటిన్యూ అయితే రూ. 500 కోట్లు లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

Gadar 2 Movie 16 Days Collections.. Sunny Deol Films Crossed KGF Chapter 2 Collections

కేజీఎఫ్ ఔట్.. బాహుబలి 2: 'గదర్ 2' మూవీకి హిందీలో 16 రోజుల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' లైఫ్ టైం కలెక్షన్లు (435.20 కోట్లు) రికార్డును సైతం బ్రేక్ చేసేసింది. తద్వారా హిందీలో అత్యధిక నెట్ సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరంది. మరో 70 కోట్లు నెట్ వస్తే 'బాహుబలి 2' (510.99 కోట్లు) రికార్డును కూడా బద్దలు కొడుతుంది. ఈ లిస్టులో 'పఠాన్' రూ. 543.50 కోట్లతో టాప్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X