Gadar 2 17 Days Collections: చరిత్ర సృష్టించిన గదర్ 2.. బాహుబలి, పఠాన్ ఔట్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా!

సౌతిండియన్ మూవీల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌ వాళ్లు భారీ హిట్ల కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చే చిత్రాలు నిరాశనే ఎదుర్కొంటున్నాయి. దీంతో ఢీలా పడిన ఉత్తరాది వాళ్లలో జోష్‌ను నింపిన చిత్రమే 'గదర్ 2'. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం సంచలన రికార్డును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 17 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్:ఎన్నో ఏళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న సన్నీ డియోల్ నటించిన చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. దీన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను పోషించారు.

Gadar 2 Movie 17 Days Collections.. Sunny Deol Film Became Fastest 450 Crore Net

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి:'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో 3000 థియేటర్లలోనే విడుదలైన ఈ మూవీ రెండో వారం నుంచి 3500లకు పైగా స్క్రీన్లలో నడుస్తోంది.

Gadar 2 Movie 17 Days Collections.. Sunny Deol Film Became Fastest 450 Crore Net

ఏ రోజు ఎంత వచ్చిందంటే:సీనియర్ స్టార్ సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్‌ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు రూ. 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు రూ. 17 కోట్లు వసూలు చేసింది.

Gadar 2 Movie 17 Days Collections.. Sunny Deol Film Became Fastest 450 Crore Net

17 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో వచ్చిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 'ఓ మై గాడ్ 2' సినిమా నుంచి కఠినమైన పోటీ ఉన్నా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. ఇలా 17 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 456.95 కోట్లు నెట్‌, రూ. 590 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Gadar 2 Movie 17 Days Collections.. Sunny Deol Film Became Fastest 450 Crore Net

ఏకంగా అన్ని కోట్లు లాభం:సన్నీ డియోల్ హీరోగా నటించిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 17 రోజుల్లోనే ఏకంగా రూ. 590 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 500 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ మరో వంద కోట్ల రూపాయల లాభాలనూ అందుకునే ఛాన్స్ ఉంది.

Gadar 2 Movie 17 Days Collections.. Sunny Deol Film Became Fastest 450 Crore Net

బాహుబలి 2, పఠాన్ ఔట్:'గదర్ 2' మూవీకి హిందీలో 17 రోజుల్లోనే హిందీలో రూ. 450 కోట్లు నెట్‌ కలెక్షన్లు సాధించింది. తద్వారా వేగంగా ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ చిత్రంగా ఈ మూవీ రికార్డును సాధించింది. ఈ క్రమంలోనే 'పఠాన్' 18 రోజులు, 'బాహుబలి 2' 20 రోజులు రికార్డులను ఇది బ్రేక్ చేసింది. అదే సమయంలో లాభాల పరంగానూ చరిత్రను సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X