Gadar 2 18 Days Collections: గదర్ 2 రికార్డుల పరంపర... జైలర్‌ను దాటేసి మున్ముందుకు!
కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల దెబ్బకు బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. ఇక అటువంటి సమయంలో గత ఏడాది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో వచ్చి మళ్లీ బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకువచ్చారు. అయితే ఈసారి సీనియర్ హీరో సన్నీ డియోల్... బహుబలి, పఠాన్ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ.. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడిలా మారిపోయారు. ఆయన నటించిన తాజా చిత్రం గదర్ 2.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 18 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
బాలీవుడ్ మూవీస్ మళ్లీ సత్తా చూపిస్తున్నాయి. గత కొంత కాలంగా సౌత్ మూవీస్ దెబ్బకు డీలా పడినా బాలీవుడ్... మళ్లీ షారుక్ సినిమాతో కాస్త కోలుకుంది. ఇప్పుడు సీనియర్ హీరో సన్ని డియోల్ సినిమా గదర్ 2 రాగా... బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షంతో పాటు.. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ పోతుంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన రాగా... కలెక్షన్లు మాత్రం ఆగకుండా వస్తూనే ఉన్నాయి.

2001లో సన్నీ డియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమా తీసి.. ప్రభంజనం సృష్టించారు. ఇక ఈ మూవీలో సన్నీ డియోల్ సరసన అమిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు దాదాపు 22 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించారు అనిల్ శర్మ. ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మనే నిర్మించడం విశేషం. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించగా.. గదర్ 1లో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ ఇందులోనూ తనే హీరోయిన్. ఇక ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను పోషించారు.

సన్నీ డియోల్ నటించిన ఈ 'గదర్ 2' చిత్రంపై మొదట్లో అంచనాలు అంతగా లేవు. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. ఫలితంగా సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదట్లో 3000 థియేటర్లలోనే విడుదలైన గదర్ 2 మూవీ రెండో వారం నుంచి 3500లకు పైగా స్క్రీన్లలో నడుస్తోంది.

సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు చేయగా... రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు రూ. 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు రూ. 17 కోట్లు, 18వ రోజు రూ.4.50కోట్లు సాధించింది.

యాక్షన్, పిరియాడిక్ డ్రామాతో వచ్చిన గదర్ 2 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచే మంచి టాక్ వచ్చింది. ఇక అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 పోటీగా ఉన్నా... అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేస్తోంది. మరోవైపు జైలర్ రికార్డును కూడా బ్రేక్ చేసేసింది. గదర్ 2 సినిమా ఓవర్సీస్ లో 18 రోజుల్లో 56 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంటే జైలర్ మూవీ 19 రోజుల్లో 189 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.
కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... జైలర్ మూవీ 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 575 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంటే... గదర్2 సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనితో సన్ని డియెల్ గదర్2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైలర్ కలెక్షన్స్ ని బీట్ చేసి... 600 కోట్ల మైలు స్టోన్ ను అధిగమించింది. గదర్ 2, జైలర్ రెండూ కలిపి ఆల్ మోస్ట్ 1175 కోట్లకు పైగా గ్రాస్ ను 20 రోజుల లోపే అందులోవడం నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పవచ్చు.

సన్నీ డియోల్ 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 18 రోజుల్లోనే ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 510 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ సాధిస్తుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











