Gadar 2 Movie 24Days Collections: సినీ చరిత్రలో సంచలనం.. ఫస్ట్ మూవీగా రికార్డు.. ప్రభాస్‌కు మరో షాక్
కొంత కాలంగా బాలీవుడ్‌లో భారీ స్థాయిలో విజయాలు రావడం లేదు. అడపాదడపా హిట్లు వచ్చినా అవి ఇండస్ట్రీకి ఊపును ఇవ్వలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే 'గదర్ 2'. సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం ఎన్నో రికార్డులు నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ 500 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మరి 'గదర్ 2' 24 రోజుల వసూళ్లను మీరే చూడండి!
బాలీవుడ్‌లో గదర్ 2 హవా:బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా సినిమానే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి:సన్నీ డియోల్‌కు హిట్ లేకపోవడంతో మార్కెట్ తగ్గింది. దీంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు తగ్గట్లే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శన అవుతోంది.
ఏ రోజు ఎంత వచ్చిందంటే:'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. 2వ వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. అలాగే, 3వ వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు రాబట్టింది. ఇక, ఈ యాక్షన్ మూవీ 22వ రోజు రూ. 5.20 కోట్లు, 23వ రోజు రూ. 5.72 కోట్లు, 24వ రోజు రూ. 8.50 కోట్లు రాబట్టింది.

24 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి బాలీవుడ్‌కు ఊపిరిపోసేలా మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది భారీ వసూళ్లతో సత్తా చాటుతూనే ఉంది. ఇలా 24 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 501.87 కోట్లు నెట్, రూ. 657 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం:హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 24 రోజుల్లోనే ఏకంగా రూ. 657 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 567 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది.

చరిత్ర సృష్టించిన మూవీ:'గదర్ 2' మూవీకి హిందీలో 24 రోజుల్లోనే హిందీలో రూ. 500 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. తద్వారా వేగంగా ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ చిత్రంగా ఈ మూవీ రికార్డును సాధించింది. ఈ క్రమంలోనే 'పఠాన్' 28 రోజులు, 'బాహుబలి 2' 34 రోజులు రికార్డులను ఇది బ్రేక్ చేసింది. అదే సమయంలో లాభాల పరంగానూ చరిత్రను సృష్టించింది.


Click it and Unblock the Notifications











