Gadar 2 Movie 29 Days Collections: బాహుబలి 2ను దాటిన గదర్ 2.. ఇండియాలో 2వ సినిమాగా.. లాభం చూశారంటే!
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనేలా హిందీ చిత్ర పరిశ్రమ ప్రభావం కనిపించేది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో కొంత కాలంగా ఆ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న మూవీనే 'గదర్ 2'. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం ఊహించని రీతిలో స్పందనను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' 29 రోజుల వసూళ్లను మీరే చూడండి!

గదర్ 2తో గర్జించిన సన్నీ: సన్నీ డియోల్ నటించిన యాక్షన్ సినిమానే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇది ఆగస్టు 11న విడుదలైంది.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: ఈ మధ్య కాలంలో సన్నీ డియోల్‌కుమార్కెట్ తగ్గింది. దీంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు తగ్గట్లే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లలో రన్ అయింది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే: పిరియాడిక్ యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలైంది. 2వ వారంలో ఇది రూ. 134.47 కోట్లు, 3వ వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు, నాలుగో వారంలో రూ. 27.55 కోట్లు వసూలు చేసింది. ఇక, 29వ రోజు ఈ చిత్రం రూ. 1 కోటి నెట్ మాత్రమే వసూలు చేసింది.

29 రోజుల్లో అన్ని కోట్లు ఔట్: క్రేజీ కాంబోలో తెరకెక్కిన 'గదర్ 2' మూవీకి బాలీవుడ్‌కు ఊపిరిపోసేలా మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది భారీ వసూళ్లతో సత్తా చాటుతూనే వచ్చింది. ఇలా 29 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 511 కోట్లు నెట్, రూ. 676 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం: హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 29 రోజుల్లోనే ఏకంగా రూ. 676 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 586 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే దిశగా ముందుకు సాగుతోంది.

బాహుబలి 2ను దాటింది: సన్నీ డియోల్ - అనిల్ శర్మ కలయికలో రూపొందిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 29 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 511 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)ను కూడా ఈ చిత్రం దాటేసింది ఇండియాలో టాప్ 2 మూవీగా నిలిచింది. ఈ లిస్టులో 'పఠాన్' మొదటి స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











