Gadar 2 collections చరిత్ర సృష్టించిన గదర్ 2 కలెక్షన్లు.. బాక్సాఫీస్‌పై సన్నీడియోల్ పంజా.. లాభం ఎన్ని కోట్లంటే
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించిన చిత్రం గదర్ 2. గదర్: ఏక్ ప్రేమ కథ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి అనిల్ శర్మ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ చిత్రాన్ని జీ స్డూడియోస్, అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎంఎం మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ సినిమా తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లను సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే...
13 కోట్లతో గదర్.. 130 కోట్ల లాభం:
1947లో పాకిస్థాన్ విభజన కథా నేపథ్యంగా రూపొందిన గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రానికి అనిల్ శర్మనే దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో 13 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 130 కోట్లకుగా వసూలు చేసింది.

గదర్ 2 బడ్జెట్ ఎంతంటే?: ఉత్తరాది సినిమా పరిశ్రమలో ఆల్ టైమ్ ఫేవరేట్‌గా నిలిచిన గదర్ సినిమాకు విశేషంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా గదర్ 2 వస్తుండటంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గదర్ 2 సినిమాను మీడియం బడ్జెట్ అంటే 80 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందే మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమాను 3500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.
రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరువగా..: గదర్ 2 చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఇండియాలో 40 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు 43 కోట్లు వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

గదర్ 2 మూవీ 3వ రోజు ఆక్యుపెన్సీ: గదర్ 2 చిత్రం మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మార్నింగ్ షోకు 70 శాతం, మ్యాట్నీకి 92 శాతం, ఫస్ట్ షోకు 97 శాతం, సెకండ్ షోకు 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ముంబైలో 80 శాతానికి పైగా, నోయిడాలో 95 శాతం, పూణేలో 78 శాతం, బెంగళూరులో 90 శాతం, హైదరాబాద్‌లో 72 శాతం, కోల్‌కతాలో 70 శాతం, ఆహ్మదాబాద్‌లో 90 శాతం, చెన్నైలో 100 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

గదర్ 2 మూడో రోజు కలెక్షన్లు: గదర్ 2 సినిమా 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సన్నిడియోల్ మ్యాజిక్ భారీగా కనిపించింది. ఈ చిత్రం మూడో రోజు 52 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. తొలి రెండు రోజుల కంటే మూడో రోజు 20 శాతానికి పైగా అధికంగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 135 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం మూడు రోజుల్లో సుమారు 70 కోట్ల వరకు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

గదర్ 2 సినిమాకు భారీ లాభాలు: గదర్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. రిలీజ్‌కు ముందు ఈ మూవీ ముందు కష్టమైన లక్ష్యం లేదనిపించిందిది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 80 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం మూడు రోజుల్లోనే భారీ లాభాల్లోకి చేరుకొన్నది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కొనసాగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











