గద్దలకొండకొండ గణేష్ హవా.. సాలీడ్‌గా దూసుకెళ్తూ 10 రోజుల్లో..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది గద్దలకొండ గణేష్ సినిమా. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నేటికీ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. కలెక్షన్స్ పరంగా సాలీడ్‌గా దూసుకుపోతోంది. విడుదలై 10 రోజులు గడిచాక కూడా ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండటం చిత్రయూనిట్‌లో ఆనందం చిగురింప జేస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9వ రోజు 88 లక్షలు వసూలు చేసిన గద్దలకొండకొండ గణేష్ 10వ రోజు కోటికి పైగా రాబట్టాడు. గద్దలకొండకొండ గణేష్ లేపుతున్న గత్తరకు ప్రేక్షక లోకం ఫిదా అవుతోంది. మొత్తంగా చూస్తే 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం 7.48 కోట్లు, సీడెడ్ 3.30 కోట్లు, ఉత్తరాంధ్ర 2.40 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.58 కోట్లు, వెస్ట్ గోదావరి 1.35 కోట్లు, గుంటూరు 1.71 కోట్లు, కృష్ణా 1.33 కోట్లు, నెల్లూరు 79 లక్షలు, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 19.94 కోట్ల మేర రాబట్టాడు గద్దలకొండ గణేష్. ఇతర రాష్ట్రాలు, ఓవెర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 23.08 కోట్ల షేర్ వచ్చిందని పేర్కొంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇక గద్దలకొండ గణేష్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు రూ.7.4 కోట్లు, సీడెడ్ రూ.3.35 కోట్లు, ఆంధ్రా రూ.9 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం రూ.19.75 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ రూ.3 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రూ.24.25 కోట్లు జరిగింది. ఈ లెక్కన మరో 1.85 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది గద్దలకొండ గణేష్.


Click it and Unblock the Notifications











