Gam Gam Ganesha Collections ఆనంద్ దేవరకొండ మూవీకి ఊహించని కలెక్షన్లు.. గం గం గణేశాకు ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక నటించిన చిత్రం గం.. గం.. గణేశా. ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మే 31వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..
గం.. గం.. గణేశా సినిమా విషయానికి వస్తే.. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రకరకాల ట్విస్టులు, లేయర్లతో కథనం సాగుతంది. భారీగా నటీనటులతో ఈ సినిమాను వినోదాత్మకంగా రూపొందించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పుంజుకొంటుందా? అనేది ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.

గం.. గం.. గణేశా సినిమా బడ్జెట్, బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నటీనటులు పారితోషికం, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ వ్యయాలు అంతా కలిపి ఈ చిత్రానికి సుమారుగా 8 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కుల అమ్మకం కూడా పాజిటివ్‌గానే ముగిసిందనేది ట్రేడ్ వర్గాల టాక్.
బేబీ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ సినిమా కావడంతో గం..గం.. గణేశా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కొంత బెటర్‌గానే కనిపించింది. ఈ సినిమాకు తొలి రోజు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఈ మూవీకి తెలంగాణ ప్రాంతంలో మోస్తారుగా, ఆంధ్రాలో కొంత బెటర్‌గా స్పందన కనిపించింది. ఇక ఈ మూవీకి హైదరాబాద్, కాకినాడ, గుంటూరు, వరంగల్, కరీనంగర్ ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక గం.. గం.. గణేశా సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితిని చూస్తే మెరుగైనా వసూళ్లను నమోదు చేసినట్టు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 60 లక్షల గ్రాస్, ఇండియావైడ్ 20 లక్షల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











