Game Changer Collections: షాకింగ్‌గా గేమ్ ఛేంజర్ కలెక్షన్లు.. RRR ని రాంచరణ్ బీట్ చేస్తాడా? ఎన్ని కోట్లంటే?

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో కనీవిని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. అంజలి, కియారా అద్వాణీ, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

3 ఏళ్ల క్రితం ప్రారంభమై..
గేమ్ ఛేంజర్ సినిమాను అట్టహాసంగా 3 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్టుగా ఓ రేంజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా ఆలస్యం కావడంతో ముందు అంచనా వేసుకొన్న బడ్జెట్ కంటే భారీగా పెరిగిపోయిందనే విషయం అందరికి తెలిసిందే.

Game Changer Day 1 Box Office Expected Collections Worldwide Will Ram Charan movie beat RRR Acharya

500 కోట్ల బడ్జెట్‌తో
అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమైనప్పటికీ దిల్ రాజు క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. కేవలం 5 పాటలకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఊహకు అందని విషయం. ఒక్కోపాటు రెండు వారాలపాటు విదేశాల్లోని అత్యంత అద్బుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక రాంచరణ్ సినిమాకు భారీగానే బడ్జెట్ జరిగింది. నైజాంలో 43 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, నైజాంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసుకొన్నది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రాంచరణ్ మూవీ స్క్రీన్ కౌంట్
గేమ్ ఛేంజర్ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తుండటం విశేషంగా మారింది. నైజాంలో 375 స్క్రీన్లు, ఆంధ్రా, సీడెడ్‌లో కలిపి 600 స్క్రీన్లతో మొత్తంగా 900 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేస్తున్నారు. కర్నాటకలో 200, కేరళలో 150 స్క్రీన్లు, నార్త్ అమెరికాలో 575 లోకేషన్లు, ఓవర్సీస్‌లో 2200 స్క్రీన్లలో ఇక ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లకుపైగా విడుదల అవుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Game Changer Day 1 Box Office Expected Collections Worldwide Will Ram Charan movie beat RRR Acharya

డే 1 కలెక్షన్లు
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కాస్త ఆలస్యంగా ఊపందుకొన్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు 80 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన RRR సినిమా 223 కోట్లు, 70 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలకు మధ్యస్తంగా వసూళ్లను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: game changer ram charan dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X