Game Changer: రికార్డు ధరకు గేమ్ ఛేంజర్ రైట్స్.. నార్త్ ఇండియా బిజినెస్ ఎన్ని కోట్లంటే?
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ అందుకున్న తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే.. గేమ్ ఛేంజర్ మూవీ నార్త్ ఇండియా ( హిందీ)రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ భారీ బడ్జెట్ మూవీ నార్త్ రైట్ ను కొనుగొలు చేసిన సంస్థ ఏంటీ? నార్త్ ఇండియా బిజినెస్ ఎన్ని కోట్లంటే? వివరాల్లోకి వెళితే..
గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. భారీ యాక్షన్స్, పొలిటికల్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వస్తున్న ఈ మూవీ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా అప్డేట్స్ కు మెగా ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ వచ్చింది. గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ 'రా మచ్చా మచ్చా' పాటకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. వీటితో ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. ఈ సాంగ్ ను డైరెక్టర్ శంకర్ సాంగ్స్ తెరకెక్కించడం కోసం దాదాపు రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే.. జరగండి జరగండి ఒక్క సాంగ్ కోసం రూ.16 కోట్లు వెచ్చించారట.
ఇలా దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్, జీ స్టూడియో కొనుగోలు చేసింది. డిజిటల్ రైట్స్ కోసం రూ.160 కోట్లు వెచ్చించి అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.తాజాగా గేమ్ చేంజర్ మూవీ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను క్లారిటీ వచ్చింది.

ఈ మూవీ హిందీ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందట. దాదాపు రూ. 100 కోట్లకు కొనుగోలు చేసిందట ఇండస్ట్రీ టాక్. కాగా AA ఫిల్మ్స్ 'పుష్ప 2' థియేటర్ రైట్స్ ను కూడా పొందింది. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'ని కూడా తీసుకోవడం విశేషం. నార్త్ ఇండియాలో కూడా గేమ్ ఛేంజర్ ఇన్పాక్ట్ కనిపిస్తోంది. ఈ మూవీ హిట్ కొడితే.. రామ్ చరణ్ క్రేజ్ మరో మెట్టు పెరుగుతుంది. మరిర చూద్దాం ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











