టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ మ్యాజిక్.. గేమ్ ఛేంజర్ తో బయటపడుతున్న మాయలు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర హీరోస్ అంటే తమ అభిమానులకి ఒక బలమైన ఎమోషన్ అని అందరికీ తెలిసిందే. ఇలా తమ హీరోల కోసం అభిమానులు ఎంత దూరం అయ్యినా వెళ్లేందుకు సిద్ధ పడతారు. అలాగే తమ అభిమానుల ఎమోషన్స్ కోసం హీరోలు కూడా చాలా కేర్ గా స్టెప్పులు తీసుకుంటారు. కాగా వారి ఆనందం కోసం భారీ వసూళ్ల పోస్టర్లు కూడా వేసి వారిని ఆనందింపజేయడానికి పెద్ద పీట వేస్తున్నారు.

అయితే ఇవి ఇప్పుడు నుంచే కాదు తెలుగు సినిమాలో ఎప్పుడు నుంచో ఉన్నవే. కాగా ఇప్పుడు ఈ ట్రెండ్ నిజానికి దూరంగా జరుగుతుంది అనే మాట కూడా విస్తృతంగా వైరల్ గా మారుతుంది. కాగా ఇండియన్ సినిమా దగ్గర నిజంగా భారీ హైప్ ఉన్న సినిమా రికార్డు ఓపెనింగ్స్ కొడితే వాటిని ఆడియెన్స్ ఇతర హీరోల అభిమానులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ హైప్ లేని సినిమాలాకి కూడా ఊహించని నంబర్స్ తో వసూళ్లు ప్రకటిస్తే మాత్రం అవి చర్చకి దారి తీస్తున్నాయి.

game changer poster leaks every movies fake collection exposed in tollywood

కాగా ఇన్నాళ్లు మరీ చర్చ రాలేదు కానీ ఇపుడు వచ్చిన ఒక్క సినిమా పోస్టర్ దెబ్బకి సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో రచ్చ మొదలైంది. కాగా ఆ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ సినిమా గేమ్ ఛేంజర్ కాగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 180 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా పోస్టర్ దెబ్బతో ఒక టాక్ మాత్రం ఇపుడు సినీ వర్గాల్లో మొదలైంది.

గేమ్ ఛేంజర్ యూనిట్ వేసుకున్న పోస్టర్ ఫేక్ అని ఇతర హీరోలు అభిమానులు వారిస్తున్నారు. అయితే ఈ ఫేక్ పోస్టర్స్ ముచ్చట ఇప్పుడు నుంచి ఉన్నది కాదు మన స్టార్ హీరోస్ ఎప్పుడు నుంచో వేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలకి మించి గేమ్ ఛేంజర్ కి ఫేక్ చేసుకున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ గా ఇతర హీరోల అభిమానులు ఎక్స్ పోజ్ అవుతున్నారు.

ఇన్ని రోజులు కొందరి హీరోలు అభిమానులు తమ హీరోల వసూళ్ల పోస్టర్స్ నిజమని చెప్తే మరి గేమ్ ఛేంజర్ కి కూడా నిజమే కదా అని చరణ్ అభిమానులు అంటున్నారు. అయితే గేమ్ ఛేంజర్ పోస్టర్ తో మిగతా స్టార్ హీరోస్ లో అభిమానులు మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో ట్రేడ్ సర్కిల్స్ వారు కూడా గత కొన్ని సినిమాలకి వచ్చిన ఒరిజినల్ వసూళ్ల కంటే ఇంత ఎక్కువ వసూళ్లు ఫేక్ చేసుకున్నారు అంటూ ఓపెన్ అవుతున్నారు.

game changer poster leaks every movies fake collection exposed in tollywood

దీనితో గేమ్ ఛేంజర్ కి వేసుకున్న ఆ 180 కోట్ల పోస్టర్ ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఈ పోస్టర్ దెబ్బకి మాత్రం అన్ని ఎలుకలు కొండ నుంచి బయటకి వస్తున్నాయి అన్నట్టుగా గత పలు భారీ సినిమాల వసూళ్ల విషయంలో మాత్రం ఒకొకటిగా ఓపెన్ అవుతున్నాయి అని అంటున్నారు.

More from Filmibeat

Read more about: game changer ram charan devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X