Game Changer Business: గేమ్ ఛేంజర్‌కు రికార్డు బిజినెస్.. రాంచరణ్ మూవీకి ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?

RRR మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు ముస్తాబైంది. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన రికార్డు స్థాయిలో రిలీజ్ కానున్నది. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య తదితరులు నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రాంచరణ్ ద్విపాత్రాభినయంతో నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగాణంతోపాటు ఇండియాలోనే టాప్ టెక్నిషియన్స్‌ భాగమయ్యారు. ఈ సినిమాలోని 5 పాటలకు సుమారుగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాకుండా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ కోసం లెక్కకు మించిన వ్యయం జరిగింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో కలిపి భారీగా ఖర్చు జరిగింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం.

Game Changer Pre Business in Telugu States Ram Charan s Movie Registered record Business

గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటలు ప్రేక్షకుల్లోను, అభిమానుల్లోను మంచి ఊపు తీసుకు రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. గ్లోబల్ స్టార్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. నైజాంలో రాంచరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అంటే.. RRR తర్వాత అత్యధికంగా బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైజాంలో 43 కోట్ల రూపాయల మేర బిజినెస్ వ్యాల్యూ కట్టారని తెలిసింది.

ఇక సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల్లో కూడా భారీగానే బిజినెస్ జరిగింది. ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసుకొన్నది.

Game Changer Pre Business in Telugu States Ram Charan s Movie Registered record Business

అలాగే, గేమ్ ఛేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే.. ఈ సినిమా భారీ లాభాలను సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Read more about: game changer ram charan dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X