Ganapath 3 days Collections 150 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్ దిశగా టైగర్ ష్రాఫ్ మూవీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటించిన గణపత్ సినిమా బాక్పాఫీస్ వద్ద భారీగా తడబాటుకు గురవుతున్నది. టైగర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌గా రూపొందిన ఈ సినిమా కలెక్షన్లు పేలవంగా నమోదు అవుతున్నాయి. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలను చేరుకోవడంలో టీమ్ దారుణంగా విఫలమైంది. దాంతో అతి తక్కువ కలెక్షన్లతో థియేట్రికల్ రన్ కొనసాగుతున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రస్తుతం కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..

గణపత్ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత చూస్తే.. సోషల్ మీడియాలో ప్రాజెక్ట్‌ K మూవీ రేంజ్‌లో ఉందంటూ కామెంట్ చేశారు. అయితే సినిమా చూస్తే చాలా నాసిరకంగా ఉంది. దాంతో ఈ సినిమా తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌తో ముందుకెళ్లింది. అమితాబ్ బచ్చన్, ఎల్లీ అవ్రామ్ లాంటి నటీనటులు కూడా ఈ సినిమాకు పాజిటివ్‌గా మారలేకపోయారనే చెప్పాలి.

Ganapath 3 days Collections worldwide: Tiger Shroff, Kriti Sanons movie dips heavily at Box office

గణపత్ సినిమాలో బాలీవుడ్‌లోని స్టార్ నటీనటులు ఉండటంతో రెమ్యునరేషన్లు అంతా కలుపుకొని భారీగానే ఖర్చు అయింది. ఈ సినిమా ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ను 150 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అంతా కలిపి మొత్తం 160 కోట్ల రూపాయలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని వెల్లడించారు.

గణపత్ మూవీ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండటంతో ఇండియాలో 1000 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు. ఇక సినిమా పెద్దగా అడ్వాన్స్ బుకింగ్‌ కూడా రాబట్టలేకపోయింది. దాంతో తొలి రోజు నుంచే పేలవంగా కలెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల వివరాలను చూస్తే భారీ నష్టాల్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ganapath 3 days Collections worldwide: Tiger Shroff, Kriti Sanons movie dips heavily at Box office

గణపత్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమా కొంత తగ్గి 2.25 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు ఈ సినిమా 2.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం 7.5 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.

Ganapath 3 days Collections worldwide: Tiger Shroff, Kriti Sanons movie dips heavily at Box office

ఇక గణపత్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఈ సినిమా కలెక్ట్ చేస్తున్న తీరు చూస్తే.. 2023లో బాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏమైనా కోలుకొంటే తప్పా నష్టాలను తగ్గించుకొనే అవకాశాలు కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X