Ganapath Closing Collections 200 కోట్ల బడ్జెట్.. 145 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల నష్టమంటే?
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యధికంగా హాట్ టాపిక్‌గా నిలిచిన చిత్రం గణపత్. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K మూవీతో ఈ సినిమాను పోల్చడంతో అందరి దృష్టి, అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతి సనన్, ఎల్లీ అవ్రామ్ తదితరులు నటించడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత దారుణమైన టాక్‌ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా గత వారం రోజల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గణపత్ సినిమా బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. టైగర్ ష్రాప్, కృతిసనన్, అమితాబ్ బచ్చన్ తదితరుల రెమ్యునరేషన్ల కారణంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ మూవీని సుమారుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 140 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

రిలీజ్‌కు ముందు గణపత్ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో రికార్డు స్థాయిలో విడుదల చేశారు. టైగర్ ష్రాఫ్ కెరీర్‌లో ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాను 2500 స్క్రీన్లలో ఇండియాలో రిలీజ్ చేశారు. ఓవర్ససీస్ అంతా కలిపితే 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
గణపత్ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు 2.25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 2.20 కోట్లు, నాలుగో రోజు 1.25 కోట్ల రూపాయాలు, ఐదో రోజు 1.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు సాధించిన కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది.
గణపత్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 12 కోట్ల నెట్, 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 2.1 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా 15 కోట్ల రూపాయలను కిందా మీదా పడుతూ కలెక్షన్లను సాధించింది.

గణపత్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ 145 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను చేపట్టింది. అయితే ఈ లక్ష్యానికి చాలా దూరంగా నిలవడంతో భారీ నష్టాలతో ముగియడం ఖాయంగా కనిపిస్తుంది. 200 కోట్ల బడ్జెట్, 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు కేవలం 15 కోట్ల రాబట్టడం ఈ సినిమా బాక్సాఫీస్ ధీన స్థితికి అద్దం పట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











