Ganapath Collection టైగర్ ష్రాఫ్ మూవీకి 70 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతి సనన్, ఎల్లీ అవ్రామ్ నటించిన గణ్‌పత్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అక్టోబర్ 20వ తేదీన దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. స్టార్ హీరోలు ఉండటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ కూడా లభించింది. ఇలాంటి క్రేజ్, అంచనాల మధ్య వచ్చిన గణపత్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గణపత్ సినిమాలో స్టార్ నటీనటులు ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాను యాక్షన్, సైంటిఫిక్ అంశాల ఆధారంగా రూపొందించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి 150 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో ఇండియాలోనే 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్లకుపైగా రూపొందించారు.

స్టార్ హీరోలు గణ్‌పత్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారినప్పటికీ.. తొలి రోజు ప్రేక్షకులను ఈ మూవీ థియేటర్‌కు రప్పించలేకపోయింది. హిందీలో పోటీగా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక దక్షిణాదిలో అగ్రహీరోలు సినిమాలు భారీగా రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ సినిమాకు స్కోప్ లేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు పేలవంగా మొదలయ్యాయి.
గణ్‌పత్ (Ganapath) సినిమా అక్యుపెన్సీ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా మరీ తక్కువగా ఆక్యుపెన్సీ కనిపించంది. మార్నింగ్ షోకు 15 శాతం, మ్యాట్నీకి 10 శాతం, ఫస్ట్ షోకు 10 శాతం, సెకండ్ షోకు 12 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. నార్త్ ఇండియాలోని ప్రధాన నగరాల్లో 10 శాతానికి మించి ఆక్యుపెన్సీ నమోదు కాకపోవడం షాకింగ్‌గా మారింది.

ఇండియాలో గణ్‌పత్ (Ganapath) సినిమా తొలి రోజు పేలవంగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల రూపాయలు షేర్ సాధించే అవకాశం ఉంది. దాంతో మొదటి రోజు ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

గణ్‌పత్ (Ganapath) సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తే.. హిట్ సినిమాగా పరిగణించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేక భారీ నష్టాలతో ముగిస్తుందా? అనేది త్వరలోనే తేలనున్నది.


Click it and Unblock the Notifications











