Gandeevadhari Arjuna Closing Collections బాక్సాఫీస్ వద్ద గాంఢీవధారి ‘మెగా’ బోల్తా.. వరుణ్ తేజ్ మూవీ ఎన్ని
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువ హీరోయిన్ సాక్షి వైద్య జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, క్లౌడ్ స్టూడియో, ఫిల్మ్ ది ఏజెన్సీ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం గాండీవధారి అర్జున. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత ఆడియెన్స్, సినీ విమర్శకులు పెదవి విరవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన గాండీవధారి అర్జున సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించారు. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంతో ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధికంగా జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా 20 కోట్ల షేర్, 42 కోట్ల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలో దిగింది.

గాండీవధారి అర్జున సినిమాకు రిలీజ్ ముందు భారీ అంచనాలు ఉండటంతో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 220 స్క్రీన్లు, సీడెడ్‌లో 115 స్క్రీన్లు, ఆంధ్రాలో 265 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి 500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.
గాండీవధారి అర్జున చిత్రం తొలి ఆట నుంచే ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమాకు ఫుల్ నెగిటివ్ టాక్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, నైజాంలో 1.5 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు 60 లక్షల గ్రాస్, మూడో రోజు 65 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తొలి వారాంతం తర్వాత గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద కోలుకోలేకపోయింది. నాలుగో రోజు ఈ సినిమా 50 లక్షల గ్రాస్, ఐదో రోజు 30 లక్షల గ్రాస్, ఆరో రోజు 36 లక్ష్లలు వసూలు చేసింది. ఏడో రోజు 32 లక్షలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 3.5 కోట్లు ఇండియావైడ్ నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి.. బాక్సాఫీస్ యాత్రను ముగించే అవకాశం ఉంది.

గాండీవధారి అర్జున సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బరిలోకి దూకింది. సుమారు 20 కోట్ల షేర్ సాధించాల్సిన నేపథ్యంలో ఈ చిత్రం 4 కోట్ల కలెక్షన్లకే పరిమితమైంది. ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాల్యూ ప్రకారం ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసింది. ఈ సినిమా దాదాపు 15 కోట్లకుపైగానే నష్టాలతో ముగిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











