Gangs of Godavari Collections విశ్వక్ సేన్ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్స్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఎన్ని కోట్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యువ రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
గోదావరి జిల్లాలో ఉండే పచ్చని ఆహ్వాదకరమైన వాతావరణం వెనుక జరిగే మాఫియా, రాజకీయ కక్షలు, పగ, ప్రతీకారాల నేపథ్యంతో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనింగ్స్ ఆశించినంతగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో మంచి కంటెంట్‌తో రూపొందించారు. కథా పరంగా లోపాలు ఉన్న ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల మేర అయి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి.

విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 8 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇక కర్నాటక హక్కులు 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 2 కోట్ల మేర జరిగాయి. దాంతో మొత్తంగా ఈ సినిమా హక్కులు 11 కోట్ల మేర జరిగాయి. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 12 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి మీడియం రేంజ్ ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు మార్నింగ్ షోకు 40 శాతం, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. అత్యధికంగా కాకినాడలో 70 శాతం, వైజాగ్‌లో 55 శాతం, గుంటూరులో 45 శాతం, వరంగల్‌లో 55 శాతం, హైదరాబాద్‌లో 50 శాతం, ఢిల్లీలో 60 శాతం, ముంబైలో 50 శాతం ఆక్యుపెన్నీ నమోదైంది.

ఇదిలా ఉండగా, తొలి రోజు ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ మూవీకి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల రూపాయల గ్రాస్, ఇండియా వైడ్ 1 కోటి రూపాయల గ్రాస్, వరల్డ్ వైడ్‌గా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లతో మొత్తంగా 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











