Gangs of Godavari Day 1 Prediction 60 కోట్ల బడ్జెట్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా అనేక మార్లు వాయిదాల పడి మే 31వ తేదీన రిలీజ్ అవుతున్నది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహారించారు. రౌడీ ఫెలో ఫేమ్, రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత సాధించాలనే వివరాల్లోకి వెళితే..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టాప్ హీరో, హీరోయిన్లు, టెక్నిషియన్ల కూర్పుతో రూపొందింది. కొన్ని కారణాల వల్ల రీ షూట్స్ చేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి సుమారుగా 60 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఘనంగా జరిగిందనేది టాక్.

ఇక విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 8 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇక కర్నాటక హక్కులు 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 2 కోట్ల మేర జరిగాయి. దాంతో మొత్తంగా ఈ సినిమా హక్కులు 11 కోట్ల మేర జరిగాయి. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 12 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యార. ఇక కర్ణాటకలో 50 స్క్రీన్లు, ఇతర రాష్ట్రాల్లో 50 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాతో మొత్తంగా 700 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ అతంత మాత్రంగానే జరిగింది. అయినా ఈ సినిమా భారీగానే తొలి రోజు కలెక్షన్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు 5 కోట్ల నుంచి 6 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుందనే విషయంపై వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











